అరటి.. అమృతఫలం! రోజుకో పండు తిన్నారంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..

రాష్ట్ర వార్త :
అన్ని కాలాల్లో.. అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే.. అందరికీ కచ్చితంగా గుర్తొచ్చేది అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, రిబోఫ్లేవిన్.. వంటి పోషకాలు పుష్కలంగా..
ఏడాది పొడవునా దొరికేది, అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే.. అందరికీ కచ్చితంగా గుర్తొచ్చేది అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు.
అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, రిబోఫ్లేవిన్, ఫొలేట్, కాపర్, పీచు, బి6, సి-విటమిన్లతో ఇది మంచి పోషకాహారం. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులను రానివ్వదు.
మనసుకు కూడా అరటి ఆహ్లాదం కలిగిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ నొప్పి, వాపులను తగ్గించి.. మొత్తంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను క్రమబద్ధం చేస్తుంది.
అరటిపండు మూత్రపిండాల్లో సమస్యలను నివారిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకుంటే నీరసం తగ్గి, తక్షణ శక్తి వస్తుంది. ఇంత మేలు చేసే అరటిపండు ఎంతో రుచిగా కూడా ఉంటుంది కనుక ఇష్టంగానే తినేయొచ్చు.
అరటి పండ్లను ఓట్‌మీల్, మిల్క్‌షేక్, స్మూథీ, సలాడ్స్‌లోనూ వేసుకోవచ్చు, స్వీట్లూ చేయొచ్చు. ఇన్ని లాభాలున్నప్పటికీ.. అలర్జీలు, ఉబ్బసం, సైనస్ లాంటి ఇబ్బందులేమైనా ఉండి బాధపడుతుంటే మాత్రం అరటిపండుకు దూరంగానే ఉండాలి.

