చెడు శ్వాస

Tips for bad breath: చాలామంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది చిన్న సమస్యే అయినా.. నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి నోరు శుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఇంటి చిట్కాలతోనూ నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. Tips for bad breath: చాలామంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది చిన్న సమస్యే అయినా.. నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. నోటి దూర్వాసన కారణంగా.. మన చుట్టూ ఉన్నవారితే కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేం, కొన్ని సార్లు నోరు తెరవడానికీ భయపడుతూ ఉంటారు. . నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో 5 నుంచి 6 శాతం మంది ప్రజలు నోటు దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. నోటి శుభ్రతను సరిగ్గా పాటించకపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. కొంతమందికి నోటి శుభ్రత పాటించినా సమస్య వస్తూ ఉంటుంది. కడుపులో సమస్యలు, ఇతర ప్రాణాంతక వ్యాధుల కారణంగా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలని అంటున్నారు.
నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి నోరు శుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. రోజూ బ్రష్ చేయడం, భోజనం చేసిన తర్వాత నోరు పుక్కిలించడం, ఎక్కువసేపు ఆకలితో ఉండకపోవడం, తరచూ నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలతోనూ నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. దంతాలు, నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం
తరచూ నోరు పొడిబారడం
చిగుళ్ల సమస్యలు
దంతాల్లో క్యావిటీ
ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం…
పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, నాలుకపై పేరుకోవడం.
డయాబెటిస్
సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం
ధూమపానం మరియు మద్యం
ఒత్తిడి, ఆందోళన
స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం
డెంటల్ హెల్త్‌లోని ఒక నివేదిక ప్రకారం, నోటిలోని బ్యాక్టీరియా చెడు వాయువును విడుదల చేస్తుంది. ఈ బ్యాక్టీరియా లాలాజలం విడుదలను నిరోధిస్తుంది. మీరుహైడ్రేటెడ్గా ఉంటే, నోటి దుర్వాసన తగ్గుతుంది. మీ నోరు పొడిగా ఉంటే.. ఒక గ్లాసు నీరు తాగండి.

