Astrology: Boy… Poverty has entered the lives of these zodiac signs… and there are difficulties at every step!

Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి రాశివారికి ఒక ‘బాధక’ గ్రహం ఉంటుంది. బాధక గ్రహమంటే అడ్డం కులు సృష్టించే గ్రహం. ఈ గ్రహం స్థితిగతులను బట్టి ఒక వ్యక్తి జీవితంలో ఏ రకమైన అడ్డంకులు ఉంటాయన్నది అర్థం చేసుకోవచ్చు.

జ్యోతిష గ్రంథాలను బట్టి, మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు 11వ స్థానాధిపతి, వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు 9వ స్థానాధిపతి, ద్విస్వభావ రాశులైన మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు 7వ స్థానాధిపతి బాధకులవు తారు. వివిధ రాశులకు ఈ ఏడాది ఈ బాధకుడు ఏ విధంగా అడ్డంకులను సృష్టిస్తాడన్నది ఇక్కడ పరిశీలిద్దాం.

మేషం
ఈ చర రాశికి 11వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు బాధకాధిపతి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతికి అడ్డుపడుతుంటాడు. ఈ రాశివారికి కింది స్థాయి ఉద్యోగుల నుంచి సమస్యలుంటాయి. కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. దుష్ర్పచారం సాగిస్తుంటారు. కొందరు మిత్రులు శత్రువులుగా మారడం జరుగుతుంది. ప్రస్తుతం శని వ్యయ స్థానంలో, రాహువు బాధక స్థానంలో ఉన్నందువల్ల సుమారు ఏడాదిన్నర పాటు ఈ కుట్రలు, కుతంత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.

వృషభం
ఈ రాశికి 9వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు బాధకాధిపతి. ఈ రాశివారిని స్వయం కృషి మీద తప్ప అదృష్టం మీద ఆధారపడే అవకాశం ఉండదు. ఒక్కొక్క మెట్టే పైకెక్కే అవకాశం ఉంటుంది. ఆశించిన పురోగతి ఉంటుంది కానీ, బాగా నిదానంగా సాగుతుంది. సాధారణంగా తండ్రి నుంచి అడ్డంకులు, అవరోధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమపడడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ శనీశ్వరుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల అడ్డంకులు ఎక్కువగా ఉండకపోవచ్చు.

మిథునం
ఈ రాశివారికి సప్తమ స్థానాధిపతి అయిన గురువు బాధకాధిపతి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వా ములతో, కుటుంబంలో జీవిత భాగస్వామితో ఏదో రూపంలో అడ్డంకులు ఎదురవుతుంటాయి. వీరి వ్యూహాలకు భాగస్వాములు తరచూ అడ్డుపడుతుంటారు. ఈ రాశివారు సొంతగా వృత్తి, వ్యాపా రాలు చేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి కూడా సహకారం లోపిస్తుంది. ప్రస్తుతం బాధకాధిపతి గురువు మిథున రాశిలోనే ఉండడం వల్ల మరో ఏడాది పాటు అడ్డంకులు తప్పకపోవచ్చు.

కర్కాటకం
ఈ రాశివారికి లాభస్థానాధిపతి అయిన శుక్రుడు బాధకాధిపతి. ఈ రాశివారికి స్నేహితులు, సన్నిహితులు బాగా అడ్డంకులు సృష్టిస్తుంటారు. పైఅధికారులే రహస్య శత్రువులవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒక పట్టాన పైకి రానివ్వరు. నమ్మించి ద్రోహం చేసే వారుంటారు. స్త్రీలతో పరిచయాలు కూడా పురోగతిని దెబ్బతీస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్త్రీ సహోద్యోగులకు దూరంగా ఉండడం మంచిది. ప్రస్తుతం శుక్రుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

సింహం
ఈ రాశివారికి 9వ స్థానాధిపతి అయిన కుజుడు బాధకాధిపతి. రక్త సంబంధీకులు, సోదరుల వల్ల పురోగతికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు సైతం అవరోధాలు సృష్టిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, శస్త్రచికిత్సల వంటి వాటితో జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ ఉద్యోగాలు మారడం వల్ల కూడా పురోగతి కుంటుపడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజుడు సింహ రాశిలోనే ఉన్నందువల్ల ఎవరితోనైనా అడ్డంకులు, ఆటంకాలు ఎక్కువగా ఉండకపోవచ్చు.

కన్య
ఈ రాశివారికి 7వ స్థానాధిపతి అయిన గురువు బాధకాధిపతి. జీవిత భాగస్వామి నుంచి, అధికారుల నుంచి అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతుంటాయి. సన్నిహితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారిని చూసి అసూయపడేవారు ఎక్కువగా ఉంటారు. కొందరు శత్రువులు మిత్రుల రూపంలో ఉంటారు. వీరి వల్ల ఈ రాశివారు ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం ఈ గురువు దశమ స్థానంలో ఉన్నందువల్ల అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల
ఈ రాశివారికి 11వ స్థానాధిపతి అయిన రవి బాధకాధిపతి. తండ్రి నుంచి, అధికారుల నుంచి సమస్యలుంటాయి. ప్రభుత్వ వర్గాల కారణంగా సంపాదనలో కొంత భాగం నష్టమైపోతుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతాధికారులు ఈ రాశివారిని స్వార్థానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో పోటీదార్లు ఎక్కువగా ఉంటారు. కొందరు మిత్రుల వల్ల కూడా ఇబ్బందులుంటాయి. ప్రస్తుతం ఈ రవి భాగ్య స్థానంలో ఉన్నందువల్ల ఈ సమస్యలు కొద్దిగా తగ్గవచ్చు.

వృశ్చికం
ఈ రాశికి 9వ స్థానాధిపతి అయిన చంద్రుడు బాధకాధిపతి. తండ్రి వైపు నుంచే కాక తల్లి వైపు నుంచి కూడా అడ్డంకులు, సమస్యలు ఎదురవుతుంటాయి. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా మోయవలసి వస్తుంది. వీటివల్ల వ్యక్తిగత పురోగతి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రి నుంచి సహాయ సహకారాలు కరువవుతాయి. ప్రయాణాల వల్ల, బదిలీల వల్ల బాగా నష్టపో తుంటారు. ప్రస్తుతం చంద్ర సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు.

ధనుస్సు
ఈ రాశివారికి 7వ స్థానాధిపతి అయిన బుధుడు బాధకాధిపతి. జీవిత భాగస్వామి నుంచి సమస్యలుంటాయి. సీనియర్లు బాగా ఇబ్బంది పెట్టడంతో పాటు ఉద్యోగంలో అడ్డంకులు కల్పిస్తుంటారు. వ్యక్తిగత పురోగతికి బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములు, ఉద్యోగంలో సహోద్యోగుల సమస్యలుంటాయి. తల్లి వైపు బంధువులు, మేనమామలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల పురోగతికి అడ్డంకులు ఉండకపోవచ్చు.

మకరం
ఈ రాశివారికి 11వ స్థానాధిపతి అయిన కుజుడు బాధకాధిపతి. ఈ కుజుడు ఎక్కువగా స్నేహి తులు, జ్యేష్ట సోదరులు, సహోద్యోగుల రూపంలో అడ్డంకులు సృష్టిస్తుంటాడు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు. ఈ రాశివారిని చూసి అసూయ పడే వారు ఎక్కువగా ఉంటారు. బంధువులు దుష్ప్రచారం సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ కుజుడు అష్టమ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయి.

కుంభం
ఈ రాశివారికి 9వ స్థానాధిపతి అయిన శుక్రుడు బాధకాధిపతి కావడం వల్ల తండ్రి వల్ల పురోగతి కుంటుపడే అవకాశం ఉంటుంది. తండ్రి పరిస్థితి బాగా లేకపోవడం వల్ల లేదా పెంపకంలో లోపం వల్ల, తండ్రి నుంచి సహకారం లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో పురోగతి ఉండకపోవచ్చు. దూర దృష్టి లోపం, అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోతుంటారు. ఉద్యోగంలో సహాయ నిరాకరణ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ శుక్రుడు చతుర్థంలో ఉన్నందువల్ల అడ్డంకులు కొద్దిగా తగ్గుతాయి.

మీనం
ఈ రాశివారికి ఏడవ స్థానాధిపతి అయిన బుధుడు బాధకాధిపతి. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి బాగా ఇబ్బందులుంటాయి. వారి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభించకపోవచ్చు. జీవిత భాగస్వామి నుంచి కూడా ఆటంకాలు, అవరోధాలు ఉండవచ్చు. వ్యాపార భాగస్వాములు కూడా సమస్యలు సృష్టిస్తుంటారు. వీటన్నిటివల్ల వ్యక్తిగత పురోగతి కుంటుపడుతూ ఉంటుంది. ప్రస్తుతం బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నందు వల్ల ఈ సమస్యలు తగ్గవచ్చు



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *