కండోమ్ వాడుతున్నారా..? అయితే మీ కొంప కొల్లేరే ..!

శృంగారం కేవలం శారీరక ఆనందానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. అయితే, మానవ ఆరోగ్యానికి స్పెర్మ్ పాత్రపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు.
స్పెర్మ్ ఒక యాంటీ డిప్రెసెంట్ (Anti-Depressant)గా పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు. ‘ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్’ పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, కండోమ్ ఉపయోగించకుండా శృంగారంలో పాల్గొన్న మహిళలు, కండోమ్ ఉపయోగించిన మహిళలతో పోలిస్తే డిప్రెషన్ లక్షణాలను తక్కువగా అనుభవించారని గుర్తించారు.

అంతేకాకుండా, శృంగారానికి దూరంగా ఉన్న మహిళలు ఎక్కువ డిప్రెషన్‌లో ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. స్పెర్మ్ విడుదలైనప్పుడు అందులోని సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ప్రోస్టాగ్లాండిన్స్ వంటి సమ్మేళనాలు యోని ద్వారా శరీరంలోకి శోషించబడి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు.
అయితే, ఈ పరిశోధన తదనంతర కాలంలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. విశ్లేషకులు ఈ అధ్యయనాన్ని తప్పుబట్టారు. మానసిక ఆరోగ్యానికి ప్రధాన కారణం సాన్నిహిత్యం, ఒత్తిడి లేని జీవనశైలి వంటి అంశాలే తప్ప, స్పెర్మ్ మాత్రమే కాదని వారు వాదించారు. కండోమ్ వాడకపోవడం లైంగిక సంక్రమణ వ్యాధులకు (STD), అలాగే అవాంఛిత గర్భధారణకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధన సరైనది కాదని, తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శించారు. ఈ అధ్యయనం శృంగారం, మానసిక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడించినప్పటికీ, కండోమ్ ఉపయోగించకపోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన నష్టాలను విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
