Are you taking a loan by pledging gold? Here are the complete details including interest rates at top banks.

Gold Loan Processing Fees : చాలామంది వ్యక్తిగత అవసరాల కోసం లేదా వ్యాపార అవసరాల కోసం డబ్బులు అప్పుగా తీసుకుంటారు. పిల్లల చదువుల కోసం, వైద్య ఖర్చుల కోసం కూడా రుణాలు తీసుకుంటారు. ఇలాంటి సమయంలో బంగారం తాకట్టు పెట్టి తక్కువ వడ్డీ రేటుతో రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు క్రెడిట్ స్కోర్ చూడకుండానే రుణం ఇస్తాయి. సాధారణంగా బంగారం విలువలో 65 శాతం నుంచి 75 శాతం వరకు రుణం ఇస్తారు. వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.90 శాతం నుంచి 8.90 శాతం వరకు వడ్డీ ఉంది.

బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం చాలా సులభం. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. బ్యాంకులు వయస్సు, రుణ మొత్తం, ప్రాసెసింగ్ సమయం, ఫీజులు వంటి వాటిని బట్టి రుణం ఇస్తాయి. చాలా బ్యాంకులు రుణంలో 0.50 శాతం నుంచి ఒక శాతం వరకు ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయి. ఈ రుణం తిరిగి చెల్లించడానికి 3 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు సమయం ఉంటుంది.

వివిధ బ్యాంకులు బంగారు రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు ఇప్పుడు చూద్దాం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.90 శాతం నుంచి 8.90 శాతం వరకు ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 8.30 శాతం నుంచి.. ఫెడరల్ బ్యాంకులో 8.50% నుంచి ఉంది. యూకో బ్యాంకులో 8.75% – 9.15% వరకు.. కెనరా బ్యాంకులో 8.75%, ఎస్‌బీఐలో 9 శాతం నుంచి ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో 9.15% – 18% శాతం వరకు సౌత్ ఇండియన్ బ్యాంకులో 9.26 శాతం నుంచి ఉంది.

ఇదే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీలో చూస్తే కనీసం 9.30 శాతం నుంచి గరిష్టంగా 17.86 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 9.40 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కరూర్ వైశ్యా బ్యాంకులో 10.20 శాతం నుంచి 10.55 శాతం వరకు.. కోటక్ మహీంద్రా బ్యాంకులో 10.56 శాతం నుంచి.. కర్ణాటక బ్యాంకులో 10.68 శాతం నుంచి.. ఇండస్ ఇండ్ బ్యాంకులో 10.83 శాతం నుంచి 16.28 శాతం వరకు ఉంది. యాక్సిస్ బ్యాంకులో 17 శాతం నుంచి వడ్డీ రేట్లు ఉన్నాయి.

పైన తెలిపిన వడ్డీ రేట్లు మారొచ్చు. ఇవి కేవలం సూచన కోసమే. ఇందులో ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు కలపలేదు. ముతూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి NBFCలు కూడా బంగారు రుణాలు ఇస్తాయి. వాటి వడ్డీ రేట్లు వేరుగా ఉంటాయి. రుణం తీసుకునే ముందు బ్యాంకును లేదా సంస్థను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

బంగారంపై రుణం తీసుకోవడం సులభమే కానీ, అన్ని వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, తిరిగి చెల్లించే విధానం గురించి పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *