ఇంట్లో చీమలతో ఇబ్బంది పడుతున్నారా..! వంటింటి చిట్కాలను ట్రై చేయండి..

రాష్ట్ర వార్త :
ఇంట్లో ఎక్కడో ఒక చోట చీమలు కనిపించడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల చీమలు ఎక్కువ సేపు ఉండవు. మరికొన్ని మాత్రం.. ఆహార పదార్ధాలు పెట్టిన డబ్బాల్లోకి, ఆహార పదార్దాల్లోకి చేరుకుని ఇబ్బందిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో చీమలు ఇంటి నుంచి తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు ప్రభావంతంగా పని చేస్తాయి. అప్పుడు ఇంట్లో చీమలు కనిపించవు.
వర్షాకాలంలో ఇంట్లో చీమలు కనిపించడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు గుంపు గుంపులుగా ఎరుపు లేదా నల్ల చీమలు ఒక మూలలో చేరుకుంటాయి. లేదా ఒక గది నుంచి మరొక గదిలోకి క్యూ కట్టడం ప్రారంభిస్తాయి. అప్పుడు వాటిని తొలగిస్తారు.. అయినా సరే మళ్ళీ కొంచెం సేపటికి అక్కడ చీమల గుంపు చేరుకుంటుంది. ఇలా చీమలు మళ్ళీ మళ్ళీ ఇంట్లోకి చీమలు రావడం వలన చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఎర్ర చీమ కుట్టినట్లయితే.. కుట్టిన ప్రాంతంలో దురద, ఎరుపు దద్దుర్లు కనిపించడం ప్రారంభమవుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో చీమలను ఇంటి నుంచి తొలగించడానికి వంటించి చిట్కాలు ప్రభావంతంగా పని చేస్తాయి.
సాధారణంగా చీమలు ఇంట్లోకి స్వీట్లు, చక్కెర, బ్రెడ్ లేదా ఇతర ఆహార పదార్థాలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చీమలు చేరుకుంటాయి. అంతేకాదు ఇల్లు శుభ్రంగా లేకపోయినా కూడా చీమలు ఇంట్లో చేరుకుంటాయి. అయితే వీటిని వదిలించుకోవడానికి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం, ఆహారాన్ని సరిగ్గా ఉంచడంతో పాటు ఈ సింపుల్ చిట్కాలు కూడా పాటించండి.
పిప్పరమింట్ నూనె చీమలను తరిమికొట్టడానికి పిప్పరమెంటు ఆకులను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం శుభ్రమైన ప్లాస్టిక్ స్ప్రే బాటిల్‌లో 2 కప్పుల నీటితో 10 నుంచి 20 చుక్కల పిప్పరమెంటు నూనెను కలపండి. ఈ నీటిని మీ ఇంటి బేస్‌బోర్డులు, కిటికీల చుట్టూ స్ప్రే చేయండి. తర్వాత ఆ నూనెను ఆరనివ్వండి. అవసరమైతే మళ్ళీ పిప్పర్ మెంట్ నూనెను అప్లై చేయండి.

