పల్లీలు తిన్న వెంటనే నీరు తాగుతున్నారా? ప్రమాదంలో మీ ఆరోగ్యం!
మనలో చాలా మంది సీజన్ తో సంబంధం లేకుండా వేడి వేడి పల్లీలు తింటాం. ఇందులో పుష్కలముగా ఉండే ప్రోటీన్ లు శరీరానికి చాలా ప్రయోజనకరం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే వెరుశనగలు అందిరికి అందుబాటులో ఉంటాయి. అయితే, వేరుశెనగల గురించి కొన్ని అపోహలు చాలామందిలో ఇప్పటికీ ఉన్నాయి. ముఖ్యంగా వేరుశనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందా? నిజంగా ఇది ఆరోగ్యానికి హానికరమా? ఇందులో వాస్తవమెంత? వైద్యుల సూచనలేంటి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, వేరుశెనగలు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల దగ్గు రావడం అనేది అవాస్తవం. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆరోగ్యంగా ఉన్నవారికి దీనివల్ల ఎలాంటి ప్రత్యక్ష దుష్ప్రభావాలు ఉండవు. అయితే వేరుశనగల్లో ప్రోటీన్ తో పాటు ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉండటంతో, ఇవి తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగితే కొందరికి కడుపు భారంగా అనిపించడం, గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. కొంత మందికి సీజన్ తో సంబంధం లేకుండా సాధారణంగా దగ్గు వస్తుంది. ఈ క్రమంలోనే పల్లీలు తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందనే అపోహాను ప్రజల్లోకి గట్టిగా పంపించేశారు కొందు.
వేరుశెనగలు ఆరోగ్యానికి మంచివే అయినా, అధికంగా తింటే బరువు పెరగడం, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ ఉప్పుతో వేరుశెనగలు తినడం వల్ల రక్తపోటు సమస్యలు పెరగవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో వేరుశెనగలు తినడం కూడా గ్యాస్, ఆమ్లత్వానికి కారణమవుతుంది. వేరుశెనగలు చలికాలంలో శరీరానికి శక్తినిచ్చే మంచి ఆహారం. అయితే వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. కొద్దిసేపు గ్యాప్ తీసుకుని నీరు తాగితే ఎలాంటి సమస్య ఉండదు. మితంగా, సరైన సమయంలో తీసుకుంటే వేరుశెనగలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. వేరుశెనగలు తిన్న తర్వాత 10-15 నిమిషాల విరామం తీసుకుని నీరు తాగితే జీర్ణక్రియకు మంచిది