Apple: మీరు తినే ఆపిల్స్ మంచివేనా ? ఈ ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టేయొచ్చు

Apple: మన ఆరోగ్యం కోసం పండ్లు తింటూ ఉంటాం. ముఖ్యంగా ఆపిల్ పండును ఎక్కువగా తింటాము. కానీ తాజా ఆపిల్‌ను గుర్తించడం ఎలా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు తింటారు. వీటిలో ఎక్కువగా ఆపిల్, అరటి పండు, ఆరెంజ్ వంటి పండ్లను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. కానీ మార్కెట్ నుండి పండ్లు కొనుగోలు చేసే సమయంలో మనకు చాలా అనుమానాలు తలెత్తుతాయి. మనం కొనుగోలు చేసిన పండు మంచిదేనా..? సహజంగా పండించారా లేదా కెమికల్స్, ఇంజెక్షలు వంటివి వాడి పెంచారా అనే ప్రశ్నలు తలెత్తుతాయి.కొన్ని పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండవు. మనం కొన్న పండ్లు ఎంతకాలం నిల్వ ఉంటుందో అనే అనుమానం కూడా ఉంటుంది. చాలా మంది ఆపిల్ ఆరోగ్యకరమైన పండు కాబట్టి తింటారు. కానీ ఈ ఆపిల్ తాజా ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు తాజా ఆపిల్‌ను ఎలా గుర్తించాలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1. ఆపిల్ తొక్కను పరిశీలించండి:
తాజా ఆపిల్ తొక్క మందంగా, దృఢంగా, మెరుస్తూ ఉంటుంది. పాత ఆపిల్ అయితే, దాని చర్మం పగుళ్లు లేదా చిరిగినట్లు కనిపిస్తుంది.
2. చేతితో నొక్కి చూడండి:
ఆపిల్‌ను నొక్కితే వెంటనే మృదువుగా ఉంటే.. లేదా గుంత ఏర్పడితే, అది పాత ఆపిల్ అయ్యే అవకాశం ఉంటుంది. తాజా ఆపిల్ గట్టిగా అనిపిస్తుంది. 3. వాసన తీసి గుర్తించండి:
తాజా ఆపిల్లు తీపి, తాజా వాసన కలిగి ఉంటాయి. కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచిన ఆపిల్లు వాసన కోల్పోయి ఉంటాయి.
4. రంగు, మచ్చలను పరిశీలించండి:
చాలా రోజులు నిల్వ చేసిన ఆపిల్ల పైభాగంలో లేత, గోధుమ లేదా నల్ల మచ్చలు కలిగి ఉంటాయి. తాజా ఆపిల్లు ఒకే రంగులో, మచ్చలు లేకుండా ఉంటాయి. 5. కట్ చేసి చూడండి:
ఆపిల్ కట్ చేసిన వెంటనే గోధుమ లేదా బూడిద రంగులోకి మారుతుందా? ఇది ఆక్సీకరణం (oxidation) వల్ల వస్తుంది, కానీ చాలా త్వరగా జరిగితే ఆపిల్ పాతది కావచ్చు.
6. మైనపు పూత ( wax coating):
కొన్నిసార్లు ఆపిల్లు తాజాగా కనిపించేందుకు మైనపు పొరతో పూత పూస్తారు. అలా అయితే, ఆపిల్‌ను కొద్దిగా వేడి నీటితో రుద్దండి. తెల్లటి పొర బయటకు వస్తే, మైనపు ఉందని అర్థం చేసుకోండి.తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. కాబట్టి, ఆపిల్లను కొనుగోలు చేసేటప్పుడు పైన చెప్పిన లక్షణాలను చూసి తాజా ఆపిల్లను ఎంచుకోండి.

