ఏ.పి రాష్ట్ర జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోగుల చక్రపాణి

రాష్ట్ర వార్త : అనంతపురం – పట్టణంలోని బుక్కరాయసముద్రం చెంత గల వాల్మీకి ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఉమ్మడి జిల్లా పాత్రికేయుల సమావేశం రవిచంద్ర నాయుడు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా రాష్ట్ర అధ్యక్షులు శివరాజ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కృష్ణా ఆంజనేయులు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు అనిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎలక్ట్రానిక్ మీడియా) శ్రీనాథ్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా మద్దినేని హరిబాబు, రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి కర్నూలు జిల్లా రామకృష్ణ, ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు అనుమల వెంకటేశ్వర్లు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పాత్రికేయుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని అన్నారు. ముఖ్యంగా అక్రిడి టేషన్ కార్డులు మంజూరు, ఇంటి పట్టాల మంజూరు, జర్నలిస్ట్ హెల్త్ కార్డుల విషయమై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారమయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం పోరాడుతుందరన్నారు. నిరంతరం జర్నలిస్టు సమస్యలపై అనేక పోరాటాలు చేసి సమస్యల పరిష్కార దిశగా ఈ సంఘం పోరాటం చేసిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జిల్లా అధ్యక్షులుగా మల్లి బోయిన రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా జీ మాని కేశవ (పుట్టపర్తి ) ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోగుల చక్రపాణి (కొత్తచెరువు) ఉపాధ్యక్షులుగా
ఎల్లంరాజు(కదిరి)
కోశాధికారిగా మల్లికార్జున (పుట్టపర్తి) కార్యవర్గ సభ్యులుగా శివ ( హిందూపురం) చలపతి(పుట్టపర్తి) తో పాటు మరి కొందరికి కార్యవర్గంలో చోటు కల్పించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుండి అనేకమంది పాత్రికేయులు హాజరయ్యారు.

Anantapur
