AP Rains: Heavy rains for another three days.. Precautions to be taken!

ఏపీవాసులకు అలర్ట్.. రాష్ట్రంలో మరో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం రోజున పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్త హెచ్చరించింది. అలాగే కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు జూలై 24 వరకూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త. రాష్ట్రంలో మరో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఏపీలో మరో 3 రోజులు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం రోజున (జూలై 19) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా, వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూలై 24 వరకు ఏపీలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారీ వర్షాల సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల సమయంలో వీలైనంత మేరకు సురక్షిత ప్రదేశంలో ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షం పడుతున్నప్పుడు వీలైతే ఇంట్లోనే ఉండాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, నీటితో నిండే ప్రదేశాలకు దూరంగా ఉండాలంటున్నారు.అలాగే వాతావరణ శాఖ, ప్రభుత్వం అందించే సూచనలు, హెచ్చరికలు, సమాచారం ఫాలో కావాలని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు వర్షాల గురించి సమాచారం తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకవద్దని.. వర్షం కురిసే సమయంలో వీలైతే కరెంట్‌ను ఆఫ్ చేయడం మంచిందంటున్నారు. నీరు ఇంట్లోకి వస్తే కరెంట్ సరఫరా ఆపివేయాలని చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని.. రహదారులపై నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనాలు నడపొద్దని సూచిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో టార్చ్, బ్యాటరీలు, ఆహారం, నీరు వంటి వాటితో కిట్ సిద్ధం చేసుకోవాలంటున్నారు.ఇక కలుషిత నీటి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. పిడుగులు పడే అవకాశం ఉంటే.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నట్లయితే ఎత్తైన చెట్లు లేదా, కరెంట్ స్తంభాల వద్ద నిలబడకూడదని చెప్తున్నారు. ఏదైనా సహాయం అవసరమైతే సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *