రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. దహనంపై నిరసనలు..

గంగాధర నెల్లూరు దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై తీవ్ర నిరసనలు, కే నారాయణస్వామి, కృపాలక్ష్మిలు ధర్నా, ఎస్పీ తుషార్ డూడి హామీ.రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన అత్యంత హేయమైన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు) నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, దేవళంపేటలో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడటంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
గ్రామస్తుల కథనం ప్రకారం, శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు ఎవరూ లేని సమయంలో దేవళంపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. పెద్ద పెద్ద మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

