Amavasya September 21, Sunday, Amavasya is very powerful.. Do this to get rid of financial difficulties and bad luck!

Sunday Amavasya September 2025 హిందూ సంప్రదాయంలో అమావాస్య (Amavasya September 21) రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పితృ పక్షాల్లో వచ్చే అమావాస్యను మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో సెప్టెంబర్‌ 21న అమావాస్య కావడం అందులోనూ ఆదివారం రోజు రావడంతో మరింత విశిష్టత సంతరించుకుంది. దీనినే మహాలయ అమావాస్య (Mahalaya Amavasya) అని కూడా పిలుస్తారు. ఈక్రమంలో అమావాస్య తిథి (Amavasya Tithi), పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం..

Amavasya September 2025 అమావాస్య అంటేనే చాలా మంది సందేహిస్తారు. అమావాస్య రోజు శుభ ముహూర్తాలు లేవని జోతిష్య పండితులు సైతం చెబుతుంటారు. అలాంటిది ఆదివారం అమావాస్య (Sunday Amavasya ) అంటే అరుదైన, ముఖ్యమైన తిథిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. అమావాస్య చంద్రుని శక్తి తగ్గిన రోజు. ఈ రెండూ కలిసినప్పుడు ప్రత్యేక యోగం ఏర్పడుతుందని చెబుతారు. దీన్నే రవి అమావాస్య (Ravi Amavasya) అంటారు. అలాగా భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్య (Mahalaya Amavasya September 21 ) అని కూడా అంటారు. ఈరోజున చేసే పూజలు, దానధర్మాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని కూడా నమ్మకం.

ఆదివారం అమావాస్య విశిష్టత

హిందూ ఆచారాల ప్రకారం ఆదివారం (Sunday) సూర్యుడికి, అమావాస్య చంద్రుడుకి సంబంధించినది. అయితే సూర్యుడు పితృదేవతలకు, ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి చిహ్నం. ఇక చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, పూర్వీకులకు సంబంధించి ప్రతీకగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల శక్తి ఒకచోట కలవడం వల్ల ఈరోజును పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు.

పితృదోషం ఉన్న వారు అమావాస్య రోజు ప్రత్యేక పూజలు, తర్పణాలు విడవడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు కలిగి దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఇక ఈరోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, శక్తి, ఆత్మ విశ్వాసం మెరుగుపడుతాయి. అనుకున్న పనిలో, వృత్తిలో విజయం సాధిస్తారు. అలాగే.. జాతకంలో సూర్యుడు లేదా చంద్ర దోషాలు ఉన్న వారు ఆదివారం అమావాస్య రోజున పరిహారాలు పాటించడం వల్ల దుష్ప్రభావాలు తగ్గి దోష విముక్తి కలుగుతుంది.

పాటించాల్సిన పరిహారాలు

ఆదివారం అమావాస్య రోజు పూర్వీకులకు పిండ ప్రధానం ఇవ్వడం వల్ల వారి ఆత్మ శాంతి కలుగుతుంది. నదిలో లేదా చెరువులో స్నానం చేసి పితృదేవతలకు నువ్వులతో కలిపి నీళ్లు వదలడం (తిలతర్పణం) ఆచరించాలి. అలాగే.. ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో ఎర్రటి పూలు, బెల్లం, కుంకుమ వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం శుభప్రదం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే.. ఆదివారం అమావాస్య రోజు దానం చేయడం కూడా చాలా మంచిది. నువ్వులు, గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంటికి సమీపంలో ఉన్న శివాలయం లేదా సూర్య భగవానుడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి.

ఆర్థిక సమస్యలు తొలగాలంటే

జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆదివారం అమావాస్య రోజు ఇంట్లో కర్పూరం తీసుకుని ఇంటి చుట్టూ తిప్పి ఇంటి బయట కాల్చేయాలి. అలాగే.. ఎర్ర మిరపకాయలు, కొన్ని నల్ల నువ్వులు తీసుకుని ఇంటి చుట్టూ తిప్పి వాటిని కూడా ప్రవహించే నీటిలో వదలేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అలాగే ఆదివారం అమావాస్య రోజు.. శ్రీమహావిష్ణువు, పరమశివుడిని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుందని విశ్వసిస్తారు.

ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కొన్ని శాస్త్రాల్లో, కొందరు ప్రముఖులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *