దుర్గమ్మ భక్తులకు అలర్ట్: ఇకపై అంతరాలయ దర్శనం ఉండదు.. ఎందుకో తెలుసా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇకపై అంతరాలయ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుండి అమలులోకి వస్తాయి? ప్రత్యామ్నాయ దర్శన మార్గాలు ఏంటి?

