ఎయిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరికి రక్తం ఎక్కించి డాక్టర్.. రోగి మృతి

రాజస్థాన్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 11న ఆసుపత్రి అత్యవసర వార్డులో తప్పుడు రక్త మార్పిడి కారణంగా 50 ఏళ్ల రోగి మంగీలాల్ మరణించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాజస్థాన్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 11న ఆసుపత్రి అత్యవసర వార్డులో తప్పుడు రక్త మార్పిడి కారణంగా 50 ఏళ్ల రోగి మంగీలాల్ మరణించాడు.
ఎయిమ్స్ ఆసుపత్రిలో ఒక రోగికి తప్పుడు రక్తం ఎక్కించడంతో మరణించాడు. అదే పేరుతో ఉన్న ఇద్దరు రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక జూనియర్ వైద్యుడు తప్పు రక్తాన్ని ఎక్కించడంతో రోగి పరిస్థితి మరింత దిగజారింది. సీనియర్ వైద్యులు ఈ సంఘటనను గమనించి రక్త మార్పిడిని నిలిపివేశారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఈ సంఘటన తర్వాత, మృతుడి కుటుంబం ఆసుపత్రి ఆవరణలో నిరసనకు దిగింది.
మంగీలాల్ అనే ఇద్దరు రోగులు AIIMSలో చేరారు. 80 ఏళ్ల మంగీలాల్‌కు రక్తహీనత కారణంగా రక్త మార్పిడి అవసరమైంది. కాగా, 50 ఏళ్ల మంగీలాల్‌కు తేనెటీగ కుట్టడంతో చికిత్స అందించారు. నిర్లక్ష్యం కారణంగా, తప్పు రోగికి రక్తం ఎక్కించారు. సగం కంటే ఎక్కువ యూనిట్లు ఎక్కించిన తర్వాత సీనియర్ వైద్యుడు వచ్చినప్పుడు మాత్రమే ఈ తప్పు బయటపడింది.
వైద్యులు వెంటనే రక్త మార్పిడిని ఆపి, బ్యాగ్‌ను చెత్తబుట్టలో పడేశారు. ఈ సంఘటన అక్టోబర్ 11న జరిగింది. 50 ఏళ్ల మంగీలాల్‌ను కాపాడటానికి వైద్యులు ప్రయత్నించారు. కానీ అతని పరిస్థితి మరింత దిగజారింది. దీపావళి రోజున ఆయన మరణించారు. ఈ సంఘటన తర్వాత, కుటుంబం ఎయిమ్స్ క్యాంపస్‌లో నిరసన నిర్వహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సమాచారం అందిన వెంటనే, బస్ని పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ నితిన్ దవే సంఘటన స్థలానికి చేరుకుని, కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత, పోస్ట్‌మార్టం పరీక్షకు ఏర్పాట్లు చేశారు.
ఈ విషయంపై దర్యాప్తునకు ఎయిమ్స్ పరిపాలన ఆదేశించింది. సంబంధిత సిబ్బంది బాధ్యతను నిర్ణయిస్తున్నామని, దోషులుగా తేలిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ప్రతినిధి తెలిపారు. ఇద్దరు రోగులకు వేర్వేరు రక్త వర్గాలు ఉంటే, ఈ పొరపాటు మరిన్ని ప్రాణాలను బలిగొనే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ సంఘటన దేశంలోని అత్యున్నత ఆరోగ్య సంరక్షణ సంస్థలో భద్రత, నిఘా స్థాయి గురించి తీవ్రమైన ప్రశ్నలను తలెత్తున్నాయి.
