Adivasi Traditions: అక్కడ టీనేజ్ వస్తే ఐబ్రోస్ కట్ చేస్తారు.. ఎందుకు తీస్తారో, వాటిని ఏం చేస్తారో తెలుసా..?

Adivasi Traditions: లోకం ఎన్ని కొత్త పోకడలు పోయినా… పాశ్చత్య ధోరణులు మారుమూల గ్రామాల్లోకి తొంగి చూస్తున్నా… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు మాత్రం తమ ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను ఏమాత్రం తప్పడం లేదు.Adivasi Traditions: లోకం ఎన్ని కొత్త పోకడలు పోయినా… పాశ్చత్య ధోరణులు మారుమూల గ్రామాల్లోకి తొంగి చూస్తున్నా… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు మాత్రం తమ ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను ఏమాత్రం తప్పడం లేదు. తర తరాలుగా వస్తున్న ఆచార, వ్యవహారాలను నేటికి క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ వాటిని భావి తరాలకు వారసత్వంగా పదిలంగా అందజేస్తున్నారు. ఏత్మసూర్ దేవతకు సమర్పించే మొక్కుల విషయంలో ఇప్పటికి ఆ ఆచారం కొనసాగుతోంది.
అడవి బిడ్డల సంప్రదాయం..
ఆదివాసి గిరిజనులు తమ ఇష్ట దైవాలను కొలిచి మొక్కడంలో ఎంతో నిష్టతో ఉంటారు. ఆచార, వ్యవహారాల్లోనూ అంతే ఖచ్చితంగా ఉంటారు. జీవిత కాలంలో ఒకసారి తమ ఆరాద్య దైవమైన ఏత్మసూర్ దేవతకు తల నీలాలు, కన్నుబొమ్మల వెంట్రుకలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా దీపావళి పండుగకు కొద్ది రోజుల ముందు జరుపుకునే పండుగ రోజున తల వెంట్రుకలతో పాటుగా కన్ను బొమ్మల వెంట్రుకలను కూడా సమర్పించి గిరిజనులు శుద్ది అయ్యామన్న సంతృప్తిని పొందుతారు.
