Actress: Tassadiyya.. Yankaramma, who is making headlines with crazy photos.. Do you remember this sweet girl..?

రాష్ట్ర వార్త

ప్రస్తుతం సినీ, బుల్లితెరపై సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. నిత్యం తమ గ్లామర్ ఫోటోస్, పర్సనల్ విషయాలు పంచుకుంటూ నెటిజన్లకు దగ్గరవుతున్నారు. మరోవైపు బుల్లితెర యాంకరమ్మలు నెట్టింట చేసే గ్లామర్ అరాచకం గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఓ యాంకర్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట గత్తరలేపుతున్నాయి.

పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..? బుల్లితెరపై ఫేమస్ యాంకర్. నిత్యం అందంతోపాటు వాక్చాతుర్యంతో జనాలను కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు టీవీల్లో చాలా బిజీ. ఇంతకీ ఆమె ఎవరంటే..

మె మరెవరో కాదండి.. సోషల్ మీడియా సెన్సేషన్, స్టార్ యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస రియాల్టీ షోలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ జనాలను ఆకట్టుకుంటున్నాయి.

మోడ్రన్, గ్లామర్ ఫోజులతో శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ అదిరిపోయాయి. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. దీంతో ఇప్పుడు శ్రీముఖి గ్లామర్ ఫోజులు తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకు హోస్టింగ్ చేస్తుంది.

ఈ షో కోసం ఇలా గ్లామర్ లుక్ లోకి మారిపోయినట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్ష లుక్స్ అంటూ ఈ అమ్మడు షేర్ చేసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై అత్యంత డిమాండ్ యాంకర్ గా మారింది.

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన శ్రీముఖి…కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రంలో బన్నీ సోదరిగా కనిపించింది.

ఆ తర్వాత రామ్ పోతినేని సిస్టర్ గా నేను శైలజ చిత్రంలో కనిపించింది. అయితే నటనతో మంచి నటిగా ప్రశంసలు అందుకున్న శ్రీముఖికి సినిమాల్లో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పైకి షిఫ్ట్ అయ్యింది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *