జిమ్‌కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిన యువతి, ముఖంపై పేరుకుపోయిన కొవ్వు కూడా మాయం, బరువు తగ్గడానికి ఆమె ఏం చేసిందో తెలుసా?

చాలా మంది బరువు తగ్గడానికి జిమ్‌లు చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరు తినే ఆహారంలో మార్పులు చేసుకుంటారు. అయితే, ఓ యువతి జిమ్‌కు వెళ్లకుండానే ముప్పై కిలోల బరువు తగ్గింది. ఆమె వెయిట్ లాస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు లేదా ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఊబకాయం అందాన్ని పాడుచేయడమే కాకుండా ఆరోగ్య సమస్యల్ని కూడా తీసుకువస్తుంది. అధిక బరువు వల్ల గుండెపోటు, టైప్ 2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, నిద్రలో శ్వాస ఆగిపోవడం, కీళ్ల సమస్యలు, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక, చాలా మంది అధిక బరువు తగ్గడానికి జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు డైట్లో మార్పులు చేసుకుంటున్నారు.
చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరిలో ఎటువంటి మార్పు కనబడదు. శరీరంతో పాటు ముఖంపై పేరుకుపోయిన కొవ్వు ఒక్కసారి తగ్గించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక, ఉదితా అగర్వాల్ అనే అమ్మాయి తన బరువు తగ్గించే ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె జిమ్‌కి వెళ్లకుండానే కొన్ని రోజుల్లో 30 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్ లాస్ జర్నీని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంది. అంతేకాకుండా ఉదితా అగర్వాల్ తన ముఖంలోని కొవ్వును తగ్గించడానికి కొన్ని చిట్కాలు కూడా పంచుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

