A woman killed her ex-boyfriend with the help of her husband and lover.. Hearing this story will make you roll your eyes!

ఆమెకు అప్పటికే పెళ్లి అయింది. భర్తతో కలిసే ఉంటున్నా మరో వ్యక్తి ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా అతడితో చాటుమాటుగా వ్యవహారం కూడా సాగిస్తోంది. నేరుగా ఇంటికే రప్పించుకుంటూ.. అతడితో కలిసే సమయంలో భర్తకు మత్తు పదార్షాలు ఇస్తోంది. ముఖ్యంగా మద్యం, ఆహారంలో వాటిని కలుపుతూ స్పృహ తప్పగానే.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇటీవలే ఈమెకు మరో వ్యక్తిపై మోజు ఏర్పడింది. దీంతో పాత ప్రియుడని వదిలేసి కొత్త ప్రేమికుడితో వ్యవహారం సాగిస్తోంది. దీంతో మాజీ ప్రేమికుడు గొడవకు దిగాడు. వేరే వ్యక్తితో ఉంటే కుదరదని చెప్పాడు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన మహిళ కొత్త ప్రియుడు, భర్త సాయంతో మాజీ ప్రేమికుడిని చంపేసింది.UP Triangle Love Story Turns Murder Case: రోజురోజుకూ మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. పలువురు మహిళు పెళ్లిళ్లు అయ్యాక కూడా పరాయి పురుషులతో ప్రేమలో పడుతూ.. కట్టుకున్న వారిని, తాను కన్నవారిని, తమను కన్నవారిని చంపేస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఇలాంటి కథలే చూశాం. కానీ ఇప్పుడు చూడబోయేది మాత్రం అంతకు మించిన కథ. ఎందుకంటే ఓ మహిళకు పెళ్లై భర్త ఉండగానే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. మూడేళ్లపాటు చాటుమాటుగా వ్యవహారం సాగించింది. ఇప్పుడు అతడిని వదిలి మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుండగా.. మాజీ ప్రేమికుడు గొడవకు దిగాడు. తనతోనే కలిసుండాలని గొడవ చేశాడు. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ఆమె కొత్త ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని చంపేసింది. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించడం గమనార్హం.

ఉత్తర ప్రదేశ్‌లోని రహీమాబాద్ ప్రాంతంలోని మలిహాబాద్‌కు చెందిన 38 ఏళ్ల కుంతి రావత్‌కు చాలా ఏళ్ల క్రితమే 45 ఏళ్ల రాంభజన్‌తో వివాహం జరిగింది. అయితే పైళ్లైనప్పటి నుంచి వీరిద్దరి జీవితం బాగానే గడిచింది. కానీ గత మూడేళ్ల క్రితం తమ బంధువులు అయిన.. అహీందర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల విజయ్ కుమార్ అలియాస్ గప్పు భార్య చనిపోయింది. సతీమణి చనిపోయినప్పటి నుంచి గప్పు కన్ను.. తన బంధువు అయిన కుంతి రావత్‌పై పడింది. ఆమెకు కూడా అతడు నచ్చగా ఇద్దరూ కలిసి ప్రేమాయణం సాగించారు. నేరుగా కుంతి అతడిని ఇంటికి రప్పించుకుంటూనే వ్యవహారం నడిపింది.ముఖ్యంగా ఆమె తన ప్రియుడు గప్పుతో శారీరకంగా కలవాలనుకున్న ప్రతీ సారి తన భర్తకు మద్యం, ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చేది. దీంతో అతడు స్పృహ తప్పేవాడు. ఆ తర్వాత ఆమె తన ప్రియుడితో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేసేంది. మూడేళ్లుగా వీరిద్దరూ ఇలాగే కాలం గడుపుతూ వస్తున్నారు. అయితే ఇవేవీ తెలియని గప్పు.. భార్యతో చాలా ప్రేమగా ఉంటున్నాడు. అయితే ఇటీవలే కుంతికి, గప్పుకు మధ్య విభేదాలు వచ్చాయి. అలాగే కుంతికి అదే గ్రామానికి చెందిన 40 ఏళ్ల జబ్బర్‌తో స్నేహం ఏర్పడింది. అది కూడా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి మొదటి ప్రియుడు అయిన గప్పును తన ఇంటికి రానివ్వడం లేదు కుంతి.దీంతో ఆమెపై కోపం పెంచుకున్న అతడు ఇటీవలే ఆమె ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు కుంతీ భర్త కూడా అక్కడే ఉండగా.. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో గప్పుపై కోపం పెంచుకున్న కుంతి.. అతడిని ఎలాగైనా చంపేయాలని భావించింది. అదే విషయాన్ని తన కొత్త ప్రియుడు జబ్బర్, భర్త రాంభజన్‌తో చెప్పింది. తన పరువు తీసినవాడు బతకూడదని వివరించింది. అందుకు వాళ్లిద్దరూ ఓకే చెప్పగా.. గప్పు హత్యకు పన్నాగం పన్నారు. జూన్ 8వ తేదీన తమ ఇంటికి రప్పించుకుని మరీ అతడిని చంపేశారు. ముగ్గురూ కలిసి ఓ కత్తితో గొంతుకోసి చంపేశారు. ఆపై రక్తం కింద కారకుండా ఓ తువ్వాలను మెడచుట్టూ చుట్టి మృతదేహాన్ని తమ ఇంటికి 100 మీటర్ల దూరంలో పడేసి వచ్చారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *