ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే

ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులోనే దుకాణం పెట్టేశారు కదరా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. మీకే అర్ధమవుతుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గంజాయి కలకలం రేపింది. కారు ఇంజన్‌లో గంజాయి రవాణా…మంటలు అంటుకోవడంతో గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. ఒడిశా రిజిస్ట్రేషన్ (OD 30 G 8729) గల ఒక కారులో ముగ్గురు వ్యక్తులు (ఒక మహిళతో సహా) గంజాయిని ప్యాకెట్ల రూపంలో కారు ఇంజన్‌లో దాచి తరలిస్తున్నారు. పాల్వంచ చేరుకున్న తర్వాత, ఇంజన్ వేడికి గంజాయి ప్యాకెట్లు మంటలు అంటుకున్నాయి. గమనించిన ముఠా సభ్యులు వెంటనే కారును పట్టణంలోని ఓ వాటర్ సర్వీసింగ్ సెంటర్‌కు తరలించారు.
అక్కడ కారు మంటలను అదుపు చేసే ప్రయత్నంలో, సిబ్బంది కారు బ్యానెట్(ఇంజిన్ కవర్) ఓపెన్ చేయగా, లోపల కాలుతున్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీనిని చూసి స్థానికులు, సర్వీసింగ్ సిబ్బంది కంగుతిన్నారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికులు అప్రమత్తం కావడంతో గమనించిన గంజాయి స్మగ్లర్లు, కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ముగ్గురు ముఠా సభ్యులలో ఒక మహిళ కూడా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు…పరారైన స్మగ్లర్లు ముఠా కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
