A topless teenage girl on the beach.. Every scene is anarchy! A shocking OTT movie

ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు తమ తమ టేస్ట్ కు తగ్గట్టుగా సినిమాలు చూసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు తమ తమ టేస్ట్ కు తగ్గట్టుగా సినిమాలు చూసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. 17 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే ఈ కథలో లెక్కకు మించిన ట్విస్టులు, ఊహించని రేంజ్ సస్పెన్స్ ఉంది.

బీచ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో 17 ఏళ్ల క్యాడెన్స్ గతం మరిచిపోతుంది. ఆ తరువాత స్టోరీ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్తుంది. తర్వాత ఏం జరుగబోతోంది? నెక్స్ట్ ఏంటి? అనే ఇంటెన్స్ క్రియేట్ చేస్తూ ఈ సిరీస్ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అసలు కథ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.ఈ సిరీస్ పేరు ‘వీ వర్ లయర్స్’ (We were liars). 2025లో అంటే ఈ ఏడాదే విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇ. లాక్‌హార్ట్ రాసిన 2014లోని బెస్ట్‌సెల్లింగ్ యంగ్ అడల్ట్ నవల ఆధారంగా జూలీ ప్లెక్, కరీనా ఆడ్లీ మెకెంజీ రూపొందించారు. ఇందులో షుభం మహేశ్వరి, ఎస్తర్ మెక్‌గ్రెగర్, ఎమిలీ ఆలిన్ లిండ్, జోసెఫ్ జడా లీడ్ రోల్స్ పోషించారు.2025 జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ రిలీజ్ చేశారు. మొత్తం 8 ఎపిసోడ్‌లతో కూడిన ఈ సిరీస్ IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. పిచ్చెక్కించే ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

సంపన్న ఫ్యామిలీలో పుట్టిన కాడెన్స్ అనే అమ్మాయి.. ప్రతి సమ్మర్ తన కజిన్స్ జానీ, మిర్రెన్ , బెస్ట్ ఫ్రెండ్ గట్ తో బీచ్‌వుడ్ ఐలాండ్‌లో గడుపుతుంది. వీళ్లను ఫ్యామిలీ మెంబర్స్ ‘లయర్స్’ అంటుంటారు. అయితే 16 ఏళ్ల వయసులో కాడెన్స్ తలకు తీవ్రమైన గాయాలై బీచ్‌లో బట్టలు లేకుండా పడిపోతుంది. దీంతో ఆమె ఆ సమ్మర్ జ్ఞాపకాలు మొత్తం మర్చిపోతుంది.ఈ యాక్సిడెంట్ తర్వాత ఆమె మైగ్రేన్స్, పెర్కోసెట్ అడిక్షన్ తో బాధపడుతుంది. దీంతో ఆమెకు ‘లయర్స్‌’ టీమ్ కూడా దూరంగా ఉంటుంది. ఆపై 17 ఏళ్ల వయసులో అదే బీచ్‌ కి వెళ్లిన కాడెన్స్.. గతేడాది జరిగిన యాక్సిడెంట్ గురించి స్వయంగా తానే నిజాన్ని కనుగొనే ప్రయత్నంలో పడుతుంది. కాడెన్స్ జ్ఞాపకాలు క్రమంగా తిరిగి వస్తాయి.ఈ క్రమంలో గతంలో డబ్బు, అధికారంతో వచ్చిన ఫ్యామిలీ సమస్యలను కాడెన్స్ గుర్తిస్తుంది. ‘లయర్స్’ అక్కడ ఉండే మాన్షన్‌ని తగలబెట్టాలని అనుకోగా.. ఈ ప్లాన్ ట్రాజెడీలో ముగుస్తుంది. కాడెన్స్ ఒక్కరు తప్ప జానీ, మిర్రెన్, గట్ అందరూ ఫైర్‌లో చనిపోతారు. ఆమె ఈ ట్రాజెడీకి తానే కారణమని తెలుసుకుంటుంది. చివరలో ఆమె లయర్స్‌తో గడిపిన సమయాన్ని, వాళ్ల ఆత్మలతో పంచుకున్నట్లుగా చూపిస్తూ ఈ కథకు ముగింపు ఇస్తారు. ఈ సీన్లు కాస్త గందరగోళానికి గురి చేసినా సినిమాలో ట్విస్టులు మాత్రం వావ్ అనిపిస్తాయి. సో సైకాలజిక్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్పుకోవాలి.




















		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *