నేలపై పాకుతూ రంగులు మార్చుతున్న వింత జీవి.. తల చూడండి ఎలా ఉందో

శ్రీకాకుళం జిల్లా పలాసలో అరుదైన వానపాము జాతికి చెందిన ఓ జీవి హాల్ చల్ చేసింది. పలాస మండలంలోని తాళభద్రలో అరుదైన ఈ వింత పాము జనాల కంటపడింది. కాసేపు అటు ఇటు తిరుగుతు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చూస్తుండగానే సమీపంలోని పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది.శ్రీకాకుళం జిల్లా పలాసలో అరుదైన వానపాము జాతికి చెందిన ఓ జీవి హాల్ చల్ చేసింది. పలాస మండలంలోని తాళభద్రలో అరుదైన ఈ వింత పాము జనాల కంటపడింది. కాసేపు అటు ఇటు తిరుగుతు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చూస్తుండగానే సమీపంలోని పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది. చూడటానికి వానపామును పోలినట్టుగానే ఉన్నా.. పరిమాణంలో దాని కన్నా పెద్దదిగా సుమారు 12 అంగలాలు పొడవు ఉంది. ఇది నేలపై పాకుతున్న క్రమంలో రంగులు మార్చుతూ వింతగా కనిపించింది. దీనికి ఉన్న మరో ప్రత్యేకం ఏంటంటే దాని తల చివర సుత్తిలాంటి ఆకారం ఉండటం. ఇది చూపరులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నెలపై మెరుస్తూ కనపించిన ఈ వింత పామును చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారి.. వైల్డ్ లైఫ్ సొసైటీ దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన వారు ఇది వానపాము జాతికి చెందిన హేమర్ హెడ్ వార్మ్ అని చెబుతున్నారు. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపించే హేమర్ హెడ్ వార్మ్ విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని చెబుతున్నారు.
వీటిని ఇళ్లల్లోకి చొరబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇది వాన పాములను తిని పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిపారు. ప్రకృతిలో శత కోటి ప్రాణులకు జీవనాధారణమైన భూమండలంలో అరుదైన హేమర్ హెడ్ వార్మ్ జాతులు అంతరించిపోకుండా అధికారులు సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

