తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా వేద సభ .

తెనాలి బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో 26 వ తేదీ, అనగా శుక్రవారం ఉదయం శ్రద్ధా భక్తులతో నిర్వహించిన వేద సభ ఎంతో ఘనంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా పూర్తయింది.
వేద మంత్రోచ్చారణలతో పరిషత్ కార్యాలయం పవిత్రత తో నిండిపోగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాలను ఆనందభరితంగా మార్చింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు తమ సమయాన్ని, సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పరిషత్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇకముందు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తూ, మన సంప్రదాయాలను, వేద ధర్మాన్ని నిలబెట్టడంలో అందరం కలిసి ముందుకు సాగుదామని కార్యవర్గం పేర్కొంది.
వేదమాత కరుణతో సమాజం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని సభ్యులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
విష్ణుభట్ల ఆంజనేయ చైన్లు, విష్ణుభట్ల జగన్నాథం, విష్ణుభట్ల శ్రీకృష్ణ
టీటీడీ విశ్రాంతి ఉద్యోగి సత్యనారాయణ అవధాని
బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గం:
అధ్యక్షులు: కోట పార్థసారథి
కార్యదర్శి: చింతపల్లి సాయికిరణ్
కోశాధికారి: కామరాజుగడ్డ శ్రీరామచంద్రమూర్తి
ఉపాధ్యక్షులు: కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్, పోతుకుచ్చి ధనుంజయ్ రామ్
కార్యవర్గ సభ్యులు: జూపూడి ప్రవీణ్, కొండపి శ్రీనివాస్

