రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే శరీరంలో కనిపించే 8 లక్షణాలు, నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలతో పాటు నరాలు డ్యామేజ్

రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అయితే, రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పించే కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు.గత కొన్నేళ్లుగా డయాబెటిస్ ముప్పు పెరుగుతూనే ఉంది. డయాబెటిస్ కేసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే దానిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దీనిని సరైన చికిత్స లేదు. కేవలం మందులు, జీవనశైలి మార్పులతోనే షుగర్‌ని నియంత్రించవచ్చు. ఇక, రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే.. కీలకమైన అవయవాలు దెబ్బతింటాయి.
రక్తంలో పెరిగిన షుగర్ లెవల్స్‌ని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పితే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్ని సకాలంలో గుర్తించకపోతే.. తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పినప్పుడు శరీరంలో కనిపించే ఎనిమిది లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు.. శరీరం మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఇది శరీరంలో నీటి కొరతకు కారణమవుతుంది. దీంతో, దాహం ఎక్కువగా వేస్తుంది. ఈ పరిస్థితిని పాలీడిప్సియా అంటారు. ఈ పరిస్థితుల్లో మీరు సాధారణం కంటే ఎక్కువ నీరు తాగుతారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో కూడా ఎక్కువగా దాహం వేస్తుంది. నిరంతర దాహం వేయడం అనేది అన్‌కంట్రోల్ డయాబెటిస్‌కి సంకేతం కావచ్చు. ఈ లక్షణాన్ని లైట్ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
తరచుగా మూత్రవిసర్జన
రక్తంలో చక్కెర స్థాయిలు 180 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు చక్కెరను విసర్జిస్తాయి. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా యూరిన్ ఎక్కువగా వస్తుంది. దీనిని పాలీయూరియా అంటారు. రాత్రి వేళ కూడా ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీని కారణంగా అలసట, నిద్ర భంగం కలుసుంది. ఈ లక్షణం నిర్జలీకరణ, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది. అందుకే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

