4K Ultra HD Smart TV offer: Get a 4K Ultra HD Smart TV worth Rs. 50,000 for Rs. 17,210, EMI for Rs. 1,115!

4K Ultra HD Smart TV offer: ఈ స్మార్ట్ టీవీ ఎందుకు కొనాలి అనే దానిపై మనం 6 అంశాలను లెక్కలోకి తీసుకోవచ్చు. వాటన్నింటినీ పరిశీలించి.. ఎందుకు కొనాలో ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే రివ్యూలు చూద్దాం. కొన్నవాళ్లు ఏం చెప్పారో అన్నీ తెలుసుకుందాం.

ఇది Hisense కంపెనీ తయారుచేసిన 108 సెంటీమీటర్లు (43 అంగుళాలు) E7Q సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED TV. ఇది బ్లాక్ కలర్‌లో ఉంది. ఈ టీవీ రిజల్యూషన్ బాగుంది. ఏకంగా 4K అల్ట్రా HD (3840 x 2160) కావడం వల్ల.. థియేటర్‌లో సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. అలాగే రిఫ్రెష్ రేటు 60 hz ఉండటం.. HSR: 120 hertz ఉండటం వల్ల కళ్లకు హాయిగా ఉంటుంది. అలాగే 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంది. అన్నివైపుల కూర్చున్నవారికీ బాగా కనిపిస్తుంది. డైనమిక్, స్టాండర్డ్, స్పోర్ట్స్, పీసీ, గేమ్, ఎనర్జీసేవింగ్, సినిమా, ఫిల్మ్‌మేకర్ మోడ్ వంటి పిక్చర్ మోడ్స్ ఈ టీవీలో ఉన్నాయి.

2. Sound:రెండో అంశం సౌండ్ క్వాలిటీ. దీనికి ఏకంగా 20W స్పీకర్స్ ఔట్‌పుట్ ఇచ్చారు. ఇల్లంతా సౌండ్ వినిపిస్తుంది. పైగా డాల్బీ అట్మోస్ ఉంది. ఇంకా ఆడియో ఈక్వలైజర్ ఉంది. అన్నివైపులకూ సమానంగా సౌండ్ వినిపిస్తుంది. ఇంకా స్టాండర్డ్, థియేటర్, స్పోర్ట్స్, మ్యూజిక్, స్పీచ్, లేట్ నైట్ వంటి సౌండ్ మోడ్స్ పెట్టుకోవచ్చు. తద్వారా మనకు ఎప్పుడు ఎలా కావాలంటే అలా సౌండ్ సెట్ చేసుకునే వీలు ఉంది.

3. Smart TV Features:స్మార్ట్ ఫీచర్లు చూస్తే… ఈ టీవీకి 8 సంవత్సరాలపాటూ అప్‌డేట్స్ చేసుకునే వీలు ఇచ్చారు. వాయిస్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. నోటితో కమాండ్స్ ఇస్తూ ఛానెల్స్, యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ద్వారా.. మొబైల్‌లో ఉన్న వీడియోలను టీవీలో డైరెక్టుగా ప్లే చేసుకోవచ్చు. స్లీప్ టైమర్ ఇచ్చారు. రాత్రి టీవీ పెట్టుకొని మనం నిద్రపోతే.. టీవీ దానంతట అదే స్విచ్ఛాఫ్ చేసుకునేలా స్లీప్ టైమర్ పెట్టుకోవచ్చు. అలెక్సా ఇందులో బిల్ట్-ఇన్‌గా ఉంది. అందువల్ల వాయిస్ కమాండ్స్ బాగా రన్ అవుతాయి.

4. Supported Apps:ఈ టీవీకి నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, సన్‌నెక్ట్స్, ఎక్స్‌ట్రీమ్ ప్లే, యాపిల్ టీవీ, క్రంచీరోల్, ట్రావెల్‌ఎక్స్‌పీ లాంటి యాప్స్ రన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. అందువల్ల వేగంగా ఓపెన్ అవుతాయి. వీటితోపాటూ.. వేల కొద్దీ ఇతర యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. గేమ్ మోడ్‌లోకి మార్చుకొని.. గేమ్స్ ఆడుకునే వీలు ఉంది.







		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *