47 takes for a lip lock.. Star hero brutally assaults heroine’s mother

మూడు గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి నటీనటులు ఎంతో కష్టపడతారు. షూటింగ్‌లో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారు, అంగ వైకల్యంతో మంచానికే పరిమితమైన నటీనటులు ఎందరో. అయినప్పటికీ తమ వృత్తిని దైవంగా భావిస్తూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమాలను పూర్తి చేస్తున్నారు నటీనటులు. సినిమాలలో యాక్షన్ సీన్స్, రిస్కీ స్టంట్స్ వంటివి ఒక ఎత్తైతే.. బెడ్ రూమ్ సీన్స్, లిప్‌లాక్ వంటి సీన్లు తీయడం చాలా కష్టం. ఇప్పుడంటే ప్రపంచం అడ్వాన్స్ అయ్యింది కానీ.. కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలను పాటించే భారత్‌లో ఇలాంటి సీన్లు.. అది కూడా 30 ఏళ్ల క్రితం తీయడమంటే ఎంతో కష్టం. అలాంటిది హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ కోసం 3 రోజులు షూటింగ్ జరిపి, 47 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

అమీర్- కరిష్మా కపూర్‌ల జోడీ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మధ్య ఇది చోటు చేసుకుంది. ధర్మేష్ దర్శన్ దర్శకత్వంలో తెరకె్కిన రాజా హిందుస్తానీ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. సురేష్ ఒబెరాయ్, అర్చనా పూరన్ సింగ్, జానీ లీవర్, ఫరీదా జలాల్, టికూ తలసానియాలు కీలకపాత్రలు పోషించారు. 1965లో శశికపూర్- నందాలు నటించిన జబ్ జబ్ పూల్ ఖిలే సినిమా ఇతివృత్తంగా ఆధారంగా రాజా హిందూస్థానీని తెరకెక్కించారు. నదీమ్ – శర్వాణ్‌లు స్వరాలు సమకూర్చగా సినీయుగ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు.

మా వల్ల కాదన్న జుహీ, ఐశ్వర్య ఆనాటి భారతీయ సమాజంలో పేద, ధనిక వర్గాలు.. వారి మధ్య ప్రేమ పుట్టడం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం వంటివి ఎక్కువగా కనిపించేవి. ఇలాంటి సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే రాజా హిందుస్తానీ. హీరోగా అమీర్ ఖాన్ ఓకే చెప్పగా.. హీరోయిన్‌ను ఎంపిక చేయడం ధర్మేష్‌కు కష్టంగా మారింది. ఆనాటి టాప్ హీరోయిన్లు జుహీ చావ్లా, ఐశ్వర్యరాయ్‌లను కలిసి కథ చెప్పగా.. వారిద్దరూ రిజెక్ట్ చేశారు. దీంతో ఆ అవకాశం కరిష్మా కపూర్‌కు వెళ్లింది.

కరిష్మకు ఫస్ట్ లిప్‌లాక్ కథ, కథనం, పాటలు అన్ని యువతను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ పాటలో అమీర్ ఖాన్- కరిష్మా కపూర్ మధ్య వచ్చే లిప్‌లాక్ సీన్ బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. కపూర్ ఫ్యామిలీకి చెందిన కరిష్మ అప్పటికీ సినీ రంగంలో అడుగుపెట్టిన కొత్త.. అప్పటికీ ఏ సినిమాలోనూ కరిష్మ లిప్ లాక్ సీన్స్‌లో నటించలేదు. అయితే రాజా హిందుస్తానీ కోసం సంప్రదించే సమయంలోనే ఈ ముద్దు సీన్ గురించి కరిష్మ, ఆమె తల్లికి దర్శకుడు ధర్మేశ్ చెప్పేశారు. అప్పట్లో సినిమా షూటింగ్‌లకు పెట్టింది పేరైన ఊటీలో గడ్డకట్టే చలిగాలులు వీచే ఫిబ్రవరి నెలలో ఈ సాంగ్ షూటింగ్ జరిగింది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *