విద్యా హక్కు చట్టం కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత కోటా సీట్ల ప్రవేశాలకు సమగ్ర శిక్షా అభి యాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు షెడ్యూల్ విడుదల చేశారు. ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈనెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారాగాని, గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యావనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రవేశాలకు శుక్రవారం ప్రకటన విడుదల చేస్తారు.
▪️ఈ నెల 7 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలి.
▪️20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థుల ఆన్లైన్ వివరాల నమోదు.
▪️మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా ప్రవేశాలకు విద్యార్థుల అర్హత నిర్ధారణ.
▪️25న మొదటి విడత సీట్ల కేటాయింపు.
▪️మార్చి 6 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాల ధ్రువీకరణ.
▪️ఏప్రిల్ 12న రెండో విడత సీట్ల కేటాయింపు.
▪️ఏప్రిల్ 13 నుంచి 23 వరకు పాఠశాలల ద్వారా విద్యార్థుల ప్రవేశాల ధ్రువీకరణ.
▪️సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబరు 18004258599 ద్వారా సంప్రదించవచ్చు.
