2 తుపాన్లు, 4 అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు జోరు వర్షాలు.. రాయలసీమలో భారీగా.!

Telangana and AP Weather Forecast Update: చిత్రంగా ఉంది. అక్టోబర్ నెలలో తుపాన్లు, అల్పపీడనాలు ఈ స్థాయిలో రావడం చాలా అరుదు. క్రమంగా భూమిపై మేఘాలు పెరుగుతున్నాయి. వేడి తగ్గుతోంది. ఇది ప్రమాదకర సంకేతమా? నేటి వాతావరణ రిపోర్ట్ తెలుసుకుందాం.మడగాస్కర్ పక్కన చెంజ్ (Chenge) అనే తుపాను ఉంది. అది గంటకు 110 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. క్రమంగా బలపడుతూ.. అతి తీవ్ర తుపానుగా మారేలా ఉంది. మరొకటి వియత్నాంకి తూర్పు వైపున ఉంది. దాని పేరు ఫెంగ్‌షెన్ (Fengshen). అది గంటకు 95 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇక 4 అల్పపీడనాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే… 1.తమిళనాడు పక్కన 50 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఉంది. 2.అరేబియా సముద్రంలో కేరళకు చాలా దూరంలో ఉంది. 3.ఇండొనేసియాకి పశ్చిమంగా హిందూ మహా సముద్రంలో ఉంది. ఇది బలపడేలా ఉంది. 4. ఇది చైనాకి తూర్పున ఉన్న అల్పపీడనం. ఇవన్నీ చాలా యాక్టివ్‌గా ఉన్నాయి.భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. 22 నుంచి 27 వరకూ.. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి 23 నుంచి 25 మధ్య ఉంది. అలాగే.. 22, 23 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అతి భారీ వర్షాలు (very heavy rainfall) కురుస్తాయి. ఇవాళ 22 కాబట్టి.. ఏపీ ప్రజలు ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కనే అల్పపీడనం ఉంది. 5 రోజులపాటూ.. దక్షిణ భారత్ అంతటా ఉరుములు, మెరుపులు ఉంటాయని IMD చెప్పింది.
మనం శాటిలైట్ లైవ్ అంచనాలు చూస్తే.. తెలంగాణలో సాయంత్రం వరకూ ఎండ వాతావరణం ఉంటుంది. అక్కడక్కడా మేఘాలు ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత తూర్పు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం మొదలై.. రాత్రి 9 వరకూ ఉంటుంది. భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదు. హైదరాబాద్‌లో జల్లులు పడితే పడొచ్చు. మాగ్జిమం ఆ అవకాశం లేదు.ఏపీలో ఇవాళ రోజంతా వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. సాయంత్రం 4 తర్వాత వర్షం బాగా పెరుగుతుంది. రేపు మార్నింగ్ 5 గంటల వరకూ కోస్తాలో వాన పడుతూ ఉంటుంది. ఏపీలో రోజంతా మేఘాలు ఉంటాయి. రాయలసీమలో ఈ మధ్య వానలు పెద్దగా లేవు. కానీ ఇవాళ మాత్రం బాగా పడతాయి. అది రైతులకు మేలు చేయవచ్చు. కాకపోతే.. భారీ వర్షాలతో జాగ్రత్తగా ఉండాలి. ఉరుములు, మెరుపులు, పిడుగుల సమస్య కూడా ఉంటుంది.బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. చెప్పాలంటే ఇది మరీ బలంగా లేదు. బలపడే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. ఇది తుపానులా మారుతుంది అని ఎవరైనా చెబితే నమ్మకండి. అంత సీన్ దానికి లేదు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో అది తమిళనాడు కడలూరు దగ్గర తీరం దాటనుంది. సాయంత్రం నుంచి రాత్రికి అది తిరుపతి, చిత్తూరుకి దగ్గరవుతుంది. భూమిపై ఉంటూ.. మనవైపు వస్తుంది. అందుకే మనకు సాయంత్రం వేళ వానలు బాగా పడతాయి. ఈ అల్పపీడనం తిరిగి సముద్రంలోకి వెళ్లినా ఆశ్చర్యం అక్కర్లేదు. ప్రస్తుతానికి రాయలసీమకే ఎక్కువ సమస్య ఉండొచ్చు. ప్రస్తుతం అన్ని సముద్రాలూ యాక్టివ్‌గా ఉన్నాయి.తెలంగాణలో ఇవాళ ఉష్ణోగ్రత 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాయలసీమలో 25 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ సంవత్సరం రాయలసీమలో అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో ఇవి ఒకటి. తేమ పగటివేళ తెలంగాణలో 61 శాతం, ఏపీలో 76 శాతం ఉంటుంది. రాయలసీమలో 89 శాతం ఉంటుంది. తేమ రాత్రివేళ తెలంగాణలో 94 శాతం, ఏపీలో 93 శాతం, రాయలసీమలో 96 శాతం ఉంటుంది. అంటే.. రాత్రివేళ రాయలసీమలో వర్షం దంచికొట్టవచ్చు.ఇక మనం ఓవరాల్ పిక్చర్ చూస్తే.. వర్షాకాలంలో ఎలాగైతే మేఘాలు ఉంటాయో.. అదే స్థాయిలో ఇప్పుడు కూడా మేఘాలు ఆసియా, భూమధ్య రేఖ, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా అంతటా ఉన్నాయి. వాటికి తోడు మజ్జిగ చిలికినట్లుగా.. సముద్రాల్ని తుపాన్లూ, అల్పపీడనాలూ చిలుకుతున్నాయి. ఫలితంగా వేడి, మేఘాలు పుడుతూ ఉన్నాయి. అందువల్ల మనకు ఇప్పట్లో వర్షాలు తగ్గే ఛాన్స్ లేనట్లే. ఈ నెలంతా ఇంతే.అంటార్కిటికాలో గత 2 వారాలుగా యాక్టివిటీ తగ్గింది. కానీ.. మళ్లీ కొత్తగా యాక్టివిటీ మొదలవుతోంది. కొత్త మేఘాలు, కొత్త సుడులు, కొత్త చలిగాలులు అక్కడ మొదలవుతున్నాయి. అంటే.. అవి మనదాకా రావడానికి మరో నెల పట్టొచ్చు. అంటే.. నవంబర్‌లో కూడా మనకు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రతీ సంవత్సరం ఇలా లేదు. ఈసారి ఈ పరిస్థితి ఉంది. ఇది ఆందోళనకరమే అని వాతావరణ నిపుణులు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.
