Bumper offer for 10th grade students.. Free 10 grams of gold.. Good chance, hurry up

Spread the love

టెన్త్ విద్యార్థులకు బంపరాఫర్.. ఫ్రీగా 10 గ్రాముల బంగారం.. మంచి ఛాన్స్, త్వరపడండి

కృష్ణా జిల్లా ఉంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పారిశ్రామికవేత్త గుత్తా సుమన్‌ కుమార్‌ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇవ్వనున్నారు. అంతేకాకుండా, ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రతి తరగతిలోనూ ఫస్ట్ వచ్చిన వారికి ఆయా తరగతుల సంఖ్యకు సమానమైన గ్రాముల బంగారం అందిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.

ఉంగుటూరు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు

టెన్త్‌లో ఫస్ట్ వచ్చిన వారికి 10 గ్రాముల గోల్డ్

6 నుంచి 9వ తరగతి వారికి కూడా ఇస్తారు

పదో తరగతి విద్యార్థులకు ఓ బంపరాఫర్.. ఫస్ట్ వస్తే బంగారం గెలుచుకోవచ్చు. కృష్ణా జిల్లా ఉంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇస్తానని పారిశ్రామికవేత్త గుత్తా సుమన్‌ కుమార్‌ ప్రకటించారు. సుమన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలంలో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు జెడ్పీ హైస్కూల్‌కు లక్ష రూపాయల విలువైన క్రీడా సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ బహుమతుల వెనుక ఉద్దేశ్యమని సుమన్ కుమార్ తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top