rastravarthanews@gmail.com

 గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసింది : పవన్ కల్యాణ్

Share      ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని… రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని అన్నారు. ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పారు.  రాజధానికి భూములు […]

 గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసింది : పవన్ కల్యాణ్ Read More »

 నాని ‘హిట్ 3’… తొలిరోజు వసూళ్లు ఎంతంటే..!

Share      నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, యువ దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్ 3’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మే డే సందర్భంగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి, నాని కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచిన ‘హిట్ 3’… విడుదలైన తొలి ఆట

 నాని ‘హిట్ 3’… తొలిరోజు వసూళ్లు ఎంతంటే..! Read More »

హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు..

Share      హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సాధారణ పాస్ హోల్డర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్తను అందించింది. ఇకపై వారు అదనంగా రూ. 20 చెల్లించి మెట్రో డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నగర ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని ‘మెట్రో కాంబో టికెట్’ పేరుతో పరిచయం చేశారు. జనరల్ బస్‌పాస్‌తో పాటు మెట్రో

హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. Read More »

పాక్, బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలు… మారిపోనున్న క్రికెట్ క్యాలెండర్!

Share      భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఉపఖండ క్రికెట్ షెడ్యూల్‌ను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ఆగస్టులో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్, ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌పై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్ పర్యటనపై సందేహాలు షెడ్యూల్ ప్రకారం, భారత క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పర్యటించి మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి

పాక్, బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలు… మారిపోనున్న క్రికెట్ క్యాలెండర్! Read More »

రూ. 2000 నోట్లు రద్దయి రెండేళ్లు.. ప్రజల వద్ద ఇంకా ఎన్ని ఉన్నాయంటే?

Share      ఆర్బీఐ రూ.2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా, ఇంకా గణనీయమైన మొత్తంలో ఈ నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు వెల్లడైంది. ఏప్రిల్ 30 నాటికి రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా బ్యాంకులకు తిరిగి రాలేదని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. 2023 మే 19న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం విదితమే. ఆ సమయానికి దేశవ్యాప్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. నోట్ల

రూ. 2000 నోట్లు రద్దయి రెండేళ్లు.. ప్రజల వద్ద ఇంకా ఎన్ని ఉన్నాయంటే? Read More »

మోదీ, చంద్రబాబు… వేదికపై ఎవరెవరు ఉన్నారంటే..!

Share      ఏపీ రాజధాని అమారావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తరలివచ్చారు. రాష్ట్ర సెక్రటేరియట్ వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్ద ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా సభాస్థలికి బయల్దేరారు. ముందుగానే గవర్నర్, డిప్యూటీ సీఎం సభా వేదికపైకి వచ్చారు. అనంతరం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపైకి వచ్చారు. మోదీకి ఈ సందర్భంగా ధర్మవరంలో ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత

మోదీ, చంద్రబాబు… వేదికపై ఎవరెవరు ఉన్నారంటే..! Read More »

వంద పాకిస్థాన్ లు వచ్చినా బదులిచ్చేందుకు ఒక్క మిస్సైల్ ఉంది.. దాని పేరు…!: నారా లోకేశ్

Share      అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు. ఇటీవల జమ్మూకశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు తన సంతాపం తెలియజేశారు. 100 పాకిస్థాన్ లు వచ్చినా, దీటుగా బదులిచ్చేందుకు మన వద్ద ఒక్క మిస్సైల్ ఉంది… ఆ మిస్సైల్ పేరు నమో (నరేంద్ర మోదీ) అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. గడ్డి కూడా పీకలేరు! “వారు భారతగడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. సింహం

వంద పాకిస్థాన్ లు వచ్చినా బదులిచ్చేందుకు ఒక్క మిస్సైల్ ఉంది.. దాని పేరు…!: నారా లోకేశ్ Read More »

ప్రధానితో వేదిక పై వారికే ఛాన్స్ – తరలి వచ్చిన ప్రముఖులు..!!

Share      అమరావతి జనసంద్రంగా మారుతోంది. అమరావతి పనుల రీ లాంఛ్ వేడుక కు సర్వం సిద్దం అయింది. గన్నవరంలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు మంత్రులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో అమరావతి వేదిక వద్దకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ ప్రధానికి అమరావతిలో స్వాగతం పలకనున్నారు. సభా వేదిక ఇప్పటికే సిద్దమైంది. కాగా, ప్రధాని తో సహా ప్రధాన వేదిక పైన 14 మందికే అవకాశం కల్పించారు. ఇక, ఈ ఘట్టానికి

ప్రధానితో వేదిక పై వారికే ఛాన్స్ – తరలి వచ్చిన ప్రముఖులు..!! Read More »

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్‌కు బ్రిటిష్ ఎంపీ కీలక సూచన

Share      భారతదేశానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవడమే కశ్మీర్ వివాదానికి శాశ్వత పరిష్కారమని భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు లార్డ్ మేఘనాథ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యకు పీఓకేను స్వాధీనం చేసుకోవడమే ఏకైక పరిష్కారమని ఆయన భారత ప్రభుత్వానికి సూచించారు. పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన దాడి అత్యంత క్రూరమైన చర్య అని లార్డ్ దేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్‌కు బ్రిటిష్ ఎంపీ కీలక సూచన Read More »

షర్మిల నివాసం వద్ద ఉద్రిక్తకర వాతావరణం…

Share      ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని ఆమె నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో, ఆమె ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంను సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె పర్యటనకు సిద్ధమవుతుండగా, పోలీసులు రంగప్రవేశం చేశారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు.

షర్మిల నివాసం వద్ద ఉద్రిక్తకర వాతావరణం… Read More »