rastravarthanews@gmail.com

 ఏపీ మద్యం కుంభకోణం నిందితుడు బాలాజీ అరెస్ట్

Share      ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితులలో ఒకరైన గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో బాలాజీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మైసూరు నుంచి ట్రాన్సిట్ వారెంట్ తో బాలాజీని విజయవాడకు తరలిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. భారతి సిమెంట్స్ కంపెనీలో గోవిందప్ప బాలాజీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కాగా, బాలాజీ అరెస్టుతో మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య […]

 ఏపీ మద్యం కుంభకోణం నిందితుడు బాలాజీ అరెస్ట్ Read More »

11 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఒప్పుకున్న పాకిస్థాన్‌

Share      పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భార‌త్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో దాయాది పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పిన విష‌యం తెలిసిందే. భారత్‌ చేపట్టిన ఈ దాడితో పాక్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఆపరేషన్ సిందూర్‌లో తనకు జరిగిన నష్టాన్ని పాక్‌ తాజాగా వెల్లడించింది. భారత్ చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ ద్వారా 11 మంది సైనికులు చ‌నిపోయినట్లు తాజాగా తెలిపింది. మృతుల్లో ఆరుగురు పాక్‌ ఆర్మీకి చెందిన వారు కాగా, ఐదుగురు వైమానిక దళానికి చెందిన వారని వెల్ల‌డించింది. అలాగే మరో

11 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఒప్పుకున్న పాకిస్థాన్‌ Read More »

కల్తీ మద్యం తాగి 15 మంది కూలీల మృతి

Share      పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మజీఠా ప్రాంతంలోని నాలుగు గ్రామాలలో కల్తీ మద్యం సేవించి 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. మృతులలో అత్యధికులు ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులేనని, భంగాలీ, మరారీ కలాన్ థెర్వాల్, పాతల్‌పురి గ్రామాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు ప్రభ్‌జిత్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అమృత్‌సర్ రూరల్ పోలీసులు వెల్లడించారు. కల్తీ మద్యం సరఫరా వెనుక ప్రభ్‌జిత్ సింగ్‌

కల్తీ మద్యం తాగి 15 మంది కూలీల మృతి Read More »

వ‌ల్ల‌భ‌నేని వంశీ రిమాండ్ పొడిగింపు

Share      సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట‌యిన వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మ‌ళ్లీ నిరాశేఎదురైంది. ఆయ‌న‌ రిమాండ్‌ను న్యాయ‌స్థానం మ‌రోసారి పొడిగించింది. రేప‌టి వరకు వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.   ఈరోజుతో రిమాండ్ ముగియ‌నుండ‌టంతో పోలీసులు ఆయ‌న్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం వంశీ రిమాండ్‌ను రేప‌టి వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో ఆయ‌న‌ను పోలీసులు మ‌ళ్లీ

వ‌ల్ల‌భ‌నేని వంశీ రిమాండ్ పొడిగింపు Read More »

పాకిస్థాన్‌కు మరో షాక్.. అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల మార్పిడి నిలిపేసిన భారత్..

Share      ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు కీలక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా, పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల మార్పిడిని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాయు మార్గం (విమానాల ద్వారా) లేదా ఉపరితల మార్గం (రోడ్డు, రైలు ద్వారా) ద్వారా వచ్చినా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జరిగే అన్ని రకాల

పాకిస్థాన్‌కు మరో షాక్.. అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల మార్పిడి నిలిపేసిన భారత్.. Read More »

అల్లు అర్జున్ కోసం ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్

Share      ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ ప్రాజెక్టుపై నిర్మాణ‌ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ఇది డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌నున్న ప్రాజెక్ట్‌. దాంతో ఈ మూవీ కోసం బ‌న్నీ ప్ర‌త్యేకంగా సన్నద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని స‌మాచారం. అందుకు త‌గ్గ‌ట్టుగా త‌న శ‌రీర ఆకృతిని మార్చుకునే ప‌నిలో

అల్లు అర్జున్ కోసం ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ Read More »

అసలు నిర్మాణమే జరగని అమరావతికి పునర్ నిర్మాణం ఏంటి?: శైలజానాథ్

Share       ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, తరతరాలుగా వెనుకబాటుకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ నేత సాకే శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను కేవలం అమరావతి నిర్మాణానికే ధారపోయడం ద్వారా ప్రాంతీయ అసమానతలను మరింత పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు నిర్మాణమే జరుపుకోని అమరావతికి పునర్ నిర్మాణం ఏంటని ప్రశ్నించారు. గతంలో గ్రాఫిక్స్‌తో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం, ఐదేళ్లలో తాత్కాలిక భవనాలు తప్ప

అసలు నిర్మాణమే జరగని అమరావతికి పునర్ నిర్మాణం ఏంటి?: శైలజానాథ్ Read More »

చెన్నై సూపర్ కింగ్స్ ఆ ఇద్దర్ని వదులుకోవచ్చు: మాజీ కోచ్ బంగర్

Share      చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని కీలక ఆటగాడు, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి చెన్నై జట్టు అశ్విన్‌ను వదులుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సీజన్‌లో అశ్విన్ ప్రదర్శన, ఆ జట్టు బడ్జెట్ సర్దుబాట్లు వంటి కారణాలతో ఈ మార్పు జరగవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ మాట్లాడుతూ, “ఐపీఎల్ 2026 సీజన్‌కు

చెన్నై సూపర్ కింగ్స్ ఆ ఇద్దర్ని వదులుకోవచ్చు: మాజీ కోచ్ బంగర్ Read More »

మూడేళ్ల తర్వాత అమరావతి సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ మళ్లీ రావాలి

Share      ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 93 శాతం స్ట్రయిక్ రేట్‌తో చరిత్రాత్మక విజయం సాధించిందని చంద్రబాబు గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉందని, ప్రధాని మోదీ

మూడేళ్ల తర్వాత అమరావతి సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ మళ్లీ రావాలి Read More »

నాకూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Share      కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. “అవును.. నాకు కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చాం. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం” అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో

నాకూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య Read More »