rastravarthanews@gmail.com

నౌకలో 21 మంది పాక్ సిబ్బంది…

Share      ఒడిశాలోని పరదీప్‌ ఓడరేవులో బుధవారం ఉదయం ఒక నౌక రాకతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పాకిస్థాన్‌కు చెందిన 21 మంది సిబ్బంది ఈ నౌకలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భారత్-పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ఎమ్‌టీ సైరెన్‌ II’ అనే పేరుగల ఈ వాణిజ్య నౌక దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా పరదీప్‌ పోర్టుకు చేరుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కోసం ఈ నౌక […]

నౌకలో 21 మంది పాక్ సిబ్బంది… Read More »

టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత!

Share      భారత-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్న టర్కీకి వాణిజ్యపరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పుణేలోని వ్యాపార వర్గాలు టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతులను నిలిపివేయగా… అదే కోవలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారులు టర్కీ నుంచి మార్బుల్ దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య ద్వారా భారత ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు, దేశీయ మార్బుల్ పరిశ్రమకు ఊతమివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్

టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! Read More »

‘ఓజీ’ షూటింగ్ కు హాజరైన పవన్ కల్యాణ్…

Share      పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ బుధవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాలుపంచుకుంటున్నారని చిత్ర నిర్మాణ సంస్థ పీఆర్ టీమ్ అధికారికంగా తెలియజేసింది. “అసలైన ‘ఓజీ’ సెట్‌లోకి అడుగుపెట్టారు” అంటూ వారు చేసిన ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్, ఇప్పుడు

‘ఓజీ’ షూటింగ్ కు హాజరైన పవన్ కల్యాణ్… Read More »

 చైనా మీడియాకు భారత్ షాక్

Share      భారత సాయుధ బలగాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న కారణంతో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు గ్లోబల్ టైమ్స్, జిన్హువాలకు చెందిన ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం బుధవారం నిషేధించింది. సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకునే ముందు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని చైనాలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల సదరు మీడియా సంస్థను హెచ్చరించింది. అయినప్పటికీ తప్పుడు ప్రచారం ఆపకపోవడంతో తాజాగా భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. “ప్రియమైన గ్లోబల్ టైమ్స్ న్యూస్, ఇలాంటి

 చైనా మీడియాకు భారత్ షాక్ Read More »

 వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం

Share      ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి తాజాగా మరో షాక్‌ తగిలిన విష‌యం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన‌ జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు. అయితే, వైసీపీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె క‌మలం పార్టీలో చేర‌డం గ‌మ‌నార్హం. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర

 వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం Read More »

పాకిస్థాన్ లో హిందూ యువతి కశీష్ చౌదరి రికార్డ్

Share      పాకిస్థాన్‌లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు. కశీష్ చౌదరి (25) అనే యువతి, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో, ఒక హిందూ మతానికి చెందిన మహిళ సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలూచిస్థాన్‌లోని చాగై జిల్లాకు చెందిన నోష్కి అనే చిన్న పట్టణం

పాకిస్థాన్ లో హిందూ యువతి కశీష్ చౌదరి రికార్డ్ Read More »

రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి

Share      రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న సంస్థలకు సత్వర అనుమతులు, పూర్తిస్థాయి సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రూ.91,839 కోట్ల పెట్టుబడితో, 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఆ కంపెనీలకు అవసరమైన చేయూత అందించడంపై  ఇవాళ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్,

రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి Read More »

 పవన్ కల్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ లో పాల్గొన్న శ్రియా రెడ్డి

Share      పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులో పునఃప్రారంభమైంది. ప్రముఖ నటి శ్రియా రెడ్డి కూడా ‘ఓజీ’ షూటింగ్‌లో పాలుపంచుకున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ఆమె నేడు పాల్గొన్నారు. సెట్స్‌లోకి తిరిగి రావడం పట్ల శ్రియా రెడ్డి తన సంతోషాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం

 పవన్ కల్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ లో పాల్గొన్న శ్రియా రెడ్డి Read More »

కూతురుకు రెండో పెళ్లి చేయాలని మనవరాలిని చంపేసిన అమ్మమ్మ..

Share      కులాంతర వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కూతురు.. మనవరాలు పుట్టాక తిరిగొచ్చింది. ఈసారి తమ కులంలోనే మంచి సంబంధం చూసి కూతురుకు మళ్లీ పెళ్లి చేయాలని ఆ తల్లి భావించింది. రెండో పెళ్లికి అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో మనువరాలు, ఐదు నెలల పసికందును హత్య చేసింది. ఈ అమానవీయ సంఘటన ఏపీలోని పిఠాపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన శైలజ, సతీష్ ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం ఇంట్లో

కూతురుకు రెండో పెళ్లి చేయాలని మనవరాలిని చంపేసిన అమ్మమ్మ.. Read More »

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం… జగన్ దిగ్భ్రాంతి

Share      పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఈ ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం… జగన్ దిగ్భ్రాంతి Read More »