rastravarthanews@gmail.com

భారత్ ఎఫెక్ట్… సెలెబీ షేరుకు చుక్కలు కనబడ్డాయి!

Share      పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ కు బాహాటంగా టర్కీ మద్దతిస్తుండడం తెలిసిందే. దాంతో, భారత్ లో వాణిజ్యపరంగా టర్కీకి ఎదురుగాలి వీస్తోంది. టర్కీ సంస్థలతో భారత్ సంస్థలు, వర్సిటీలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఈ విధంగా భారత్ ఎఫెక్ట్ కు గురైన వాటిలో సెలెబీ సంస్థ కూడా ఒకటి. ఇది భారత్ విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందిస్తుంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్ […]

భారత్ ఎఫెక్ట్… సెలెబీ షేరుకు చుక్కలు కనబడ్డాయి! Read More »

అమ్మకాల ఒత్తిడితో డీలాపడిన స్టాక్ మార్కెట్…

Share      దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఇటీవలి కాలంలో నమోదైన లాభాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో, వారాంతపు చివరి ట్రేడింగ్ సెషన్‌లో కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నష్టాలను చవిచూశాయి. వివరాల్లోకి వెళితే, బీఎస్‌ఈ సెన్సెక్స్ 200.15 పాయింట్లు (0.24 శాతం) క్షీణించి 82,330.59 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఒక దశలో 82,514.81 గరిష్ఠ స్థాయిని తాకి, మరో దశలో 82,146.95 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అదేవిధంగా,

అమ్మకాల ఒత్తిడితో డీలాపడిన స్టాక్ మార్కెట్… Read More »

48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం

Share      కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి. గత 48 గంటల్లో చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు శుక్రవారం శ్రీనగర్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో కశ్మీర్ ఐజీపీ వీకే బిర్ది కుమార్, విక్టర్ ఫోర్స్ జీఓసీ మేజర్ జనరల్ ధనంజయ జోషి, సీఆర్పీఎఫ్ ఐజీ మితేష్ జైన్ పాల్గొన్నారు. ఐజీపీ వీకే బిర్ది కుమార్ మాట్లాడుతూ,

48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం Read More »

వార్-2 సర్ ప్రైజ్… హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

Share      యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌తో రాబోతున్నట్లు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రకటించారు. దీనిపై ఎన్టీఆర్ కూడా అంతే ఆసక్తికరంగా స్పందించారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ సినిమా నుంచి ఈ కానుక ఉండబోతోందని తెలుస్తోంది. ఈ వార్తతో ఇరువురి అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. హృతిక్ ప్రకటన, ఎన్టీఆర్ స్పందన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వార్ 2’.

వార్-2 సర్ ప్రైజ్… హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ Read More »

నకిలీ ఇళ్ల పట్టాల కేసు: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

Share      నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ అనుచరుడు మోహన్ రంగారావుకు కూడా నూజివీడు కోర్టు ఇదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, ఏలూరు జిల్లా పరిధిలోని బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీ, మోహన్ రంగారావులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణ

నకిలీ ఇళ్ల పట్టాల కేసు: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ Read More »

 వ‌ల్ల‌భ‌నేని వంశీపై మ‌రో కేసు న‌మోదు

Share      వైసీపీ నేత‌, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై మ‌రో కేసు న‌మోదైంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్‌ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గ‌న్న‌వరం పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న‌పై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్ర‌మ త‌వ్వ‌కాల‌పై నివేదిక‌ను పోలీసుల‌కు స‌మ‌ర్పించారు.  2019-2024 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై మైనింగ్‌ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై

 వ‌ల్ల‌భ‌నేని వంశీపై మ‌రో కేసు న‌మోదు Read More »

రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా

Share      భార‌త జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘ‌నత సాధించాడు. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. అదే స‌మ‌యంలో సుదీర్ఘ కాలం పాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న ఆట‌గాడిగా రికార్డుకెక్కాడు. 1,151 రోజులుగా జ‌డ్డూ ఈ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక‌, తాజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో ర‌వీంద్ర‌ జడేజా (400 పాయింట్లు) త‌ర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన‌ మెహదీ

రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా Read More »

భూమికి అదే డెడ్ లైన్… 

Share      భూగోళం భవిష్యత్తుపై జపాన్‌లోని టోహో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆందోళనకరమైన విషయాలను వెల్లడించారు. సుమారు ఒక బిలియన్ (వంద కోట్ల) సంవత్సరాల తరువాత భూమిపై ప్రాణవాయువు అదృశ్యమవుతుందని, తద్వారా ప్రస్తుతం ఉన్న జీవరాశి మనుగడ అసాధ్యంగా మారుతుందని తమ అధ్యయనంలో తేల్చారు. నాసా (NASA)కు చెందిన గ్రహ నమూనాలను ఉపయోగించి చేసిన ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత సైంటిఫిక్ జర్నల్ ‘నేచర్ జియోసైన్స్’ లో ‘ది ఫ్యూచర్ లైఫ్‌స్పాన్ ఆఫ్ ఎర్త్స్ ఆక్సిజనరేటెడ్ అట్మాస్ఫియర్’ (భూమి ఆక్సిజన్ సహిత

భూమికి అదే డెడ్ లైన్…  Read More »

భర్త కాదు మానవ మృగం… 

Share      నమ్మిన భర్తే నరరూప రాక్షసుడిగా మారిన అత్యంత దారుణమైన సంఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లో వెలుగుచూసింది. కట్టుకున్న భార్యకే మత్తుమందు ఇచ్చి, ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారానికి పాల్పడి, ఆ దారుణాన్ని ఫొటోలు కూడా తీశాడు ఓ కిరాతక భర్త. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలను ‘కేట్’ (బాధితురాలికి మీడియా పెట్టిన మారుపేరు) ధైర్యంగా పంచుకుంది. అనేక అడ్డంకులు ఎదురైనా, మొక్కవోని దీక్షతో పోరాడి చివరకు తన మాజీ భర్తకు శిక్షపడేలా చేసింది. కేట్ తెలిపిన

భర్త కాదు మానవ మృగం…  Read More »

 చంచల్‌గూడ జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించండి

Share      ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దనరెడ్డి, కారాగారంలో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో అభ్యర్థన పత్రం దాఖలు చేశారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు ద్వారా ఏడేళ్ల జైలు శిక్షకు గురైన గాలి జనార్దనరెడ్డి, ప్రస్తుతం చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. జైలులో కల్పిస్తున్న వసతులకు అదనంగా మరిన్ని సౌకర్యాలు కావాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు తన న్యాయవాదుల

 చంచల్‌గూడ జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించండి Read More »