
ఏప్రిల్ 2025 – గురువారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:02
సూర్యాస్తమయం – సా. 6:29
తిథి – చవితి మ. 3:21 వరకు
తరువాత పంచమి
సంస్కృత వారం – బృహస్పతి వాసరః
నక్షత్రం – జ్యేష్ఠ ఉ. 8:15+ వరకు
యోగం – వారియ రా. 12:42+ వరకు
కరణం – భాలవ మ. 3:21 వరకు, భాలవ మ. 3:21 వరకు
వర్జ్యం – మ. 12:05 నుండి మ. 1:51 వరకు
దుర్ముహూర్తం – ఉ. 10:11 నుండి ఉ. 11:01 వరకు, మ. 3:09 నుండి మ. 3:59 వరకు
రాహుకాలం – మ. 1:49 నుండి మ. 3:22 వరకు
యమగండం – ఉ. 6:02 నుండి ఉ. 7:35 వరకు
గుళికాకాలం – ఉ. 9:09 నుండి ఉ. 10:42 వరకు
బ్రహ్మ ముహూర్తం – తె. 4:26 నుండి తె. 5:14 వరకు
అమృత ఘడియలు – రా. 10:38 నుండి రా. 12:23 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:50 నుండి మ. 12:40 వరకు
మేషం🐐
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
అదృష్ట సంఖ్య 1
వృషభం🐂
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధనచింత ఉండదు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.
అదృష్ట సంఖ్య 9
మిథునం👫
ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంలో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. మంచి అవకాశాలను కోల్పోతారు.
అదృష్ట సంఖ్య 7
కర్కాటకం🦀
ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.
అదృష్ట సంఖ్య 2
సింహం🦁
నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
అదృష్ట సంఖ్య 9
కన్య👧
మనస్సు చంచలంగా ఉంటుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు.
అదృష్ట సంఖ్య 7
తుల⚖
వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతనకార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
అదృష్ట సంఖ్య 1
వృశ్చికము🦂
స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలుంటాయి.
అదృష్ట సంఖ్య 3
ధనుస్సు🏹
చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. కుటుంబ కలహాలు దూరమవుతాయి.
అదృష్ట సంఖ్య 9
మకరం🐊
తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది.
అదృష్ట సంఖ్య 8
కుంభం
నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది.
అదృష్ట సంఖ్య 6
మీనం🐟
ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.
అదృష్ట సంఖ్య 4