Malavya Rajyog 2025: Malavya Rajyog to form next month.. Mahardasha begins for these three zodiac signs..

నవ గ్రహాల్లో శుక్రుడు సంపద, ప్రేమ, సౌందర్యం, కళలు, ఆనందం, కళ్యాణం, భోగభాగ్యాల కారకుడు. అటువంటి శుక్రుడు నవంబర్‌లో సంచారము చేసి మాలవ్య రాజ్యయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ రాజయోగం కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా నిరూపించబడుతుంది. మాలవ్య రాజ్యయోగం ఈ మూడు రాశులకు అదృష్టాన్ని, అపారమైన సంపదను ఈ యోగం కలిగిస్తుంది. కనుక ఈ మూడు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వేద జ్యోతిషశాస్త్రం అనేక రాజయోగాలు, మహాపురుష రాజ్యయోగాలను ప్రస్తావిస్తుంది. ఈ రాజయోగాలు ఏ వ్యక్తి జాతకంలోనైనా ఏర్పడితే.. వారి జీవితం సుసంపన్నంగా ఉంటుంది. వారు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోరు. గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తూ రాజయోగాలను సృష్టిస్తాయని జ్యోతిషశాస్త్రం కూడా చెబుతుంది. అలాంటి ఒక రాజ్యయోగం మలవ్య రాజ్యయోగం. ఇది శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే శుక్రుడు తన సొంత రాశిలో.. వృషభం లేదా తుల ఉన్నప్పుడు ఏర్పడుతుంది.

1 / 5

వచ్చే నెలలో అంటే నవంబర్ ప్రారంభంలో శుక్రుడు రాశి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ రాజయోగం కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా నిరూపించబడుతుంది. మాలవ్య రాజయోగం మొత్తం రాశులపై ప్రభావాన్ని చూపించినా.. మూడు రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశులు అపారమైన సంపదను పొందుతాయి. ఈ రోజు ఆ మూడు అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం?

తులా రాశి: తులారాశి వారికి మాలవ్య రాజ్యయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాజ్యయోగం తులారాశి వారి లగ్న ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో, తులారాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగవచ్చు. భాగస్వామ్యాల్లో పనిచేసే వారు ప్రయోజనం పొందవచ్చు.

ధనుస్సు రాశి: మాలవ్య రాజ్యయోగం ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో శుక్రుడు ఈ రాశి వారి కుండలిలో 11వ ఇంట్లో ఉండటం వలన ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు ఆదాయం , పెట్టుబడుల నుంచి అపారమైన ప్రయోజనం పొందవచ్చు. దీని అర్థం వారి ఆదాయంలో పెరుగుదల. కొత్త ఆదాయ వనరులు ఉద్భవించవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. నిలిచిపోయిన నిధులు తిరిగి పొందవచ్చు. వీరు పిల్లలకు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది.

మకర రాశి: మాలవ్య రాజ్యయోగం మకర రాశి వారికి చాలా శుభప్రదంగా నిరూపించబడుతుంది. ఈ రాజ్యయోగం మకర రాశి 10వ ఇంట్లో ఏర్పడుతుంది. తత్ఫలితంగా ఈ సమయంలో మకర రాశికి చెందిన వ్యాపారస్తులకు అవకాశాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లభించవచ్చు. వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *