వేంకటేశ్వరస్వామి పేరులో ‘ఈశ్వర’ ఎందుకు వచ్చింది? దశావతారాల్లో శ్రీవారు ఎందుకు లేరు?

హిందూ ధర్మంలో దైవాల పేర్లు కేవలం గుర్తింపు కోసమే కాదు. అవి దైవాల గొప్పతనాన్నీ, చరిత్రనూ, భక్తుల భావాలనూ ప్రతిబింబించే పవిత్ర సూచనలు. ముఖ్యంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. మరి ఆ బాలాజీ పేరులో ‘ఈశ్వర’ అనే పదం ఎందుకు చేరింది? ఇది ఓసారి ఆలోచించాల్సిన విషయమే. శనీశ్వరుడు, విఘ్నేశ్వరుడు వంటి చాలా పేర్లలో కూడా ‘ఈశ్వర’ మిక్స్ అయ్యింది. ఇది యమునా నది లాగా రెండు దైవిక శక్తుల మధ్య సమ్మేళనాన్ని సూచిస్తుందా? వైష్ణవులు, శైవులు కలిసి జరిపిన సమ్మేళనమేంటి? ఇది హరి-హర మహిమను ప్రపంచానికి ఎలా తెలియజేసింది?
చరిత్రలో రెండు ప్రధాన ఆచారాలు ఉండేవి. అవి శైవులు, వైష్ణవులు. శైవులు శివుణ్ని పూజించేవారు. అడ్డంగా భస్మం పూసుకునేవారు. వైష్ణవులు విష్ణుమూర్తిని ఆరాధించేవారు. నిలువుగా తిరుమాల పూసుకునేవారు. ఉత్తర భారతంలో శైవులు బలంగా ఉండేవారు, దక్షిణ భారతం వైష్ణవుల అడ్డాలా ఉండేది. ఈ రెండు దైవ ఆచారాల మధ్య వివాదాలూ, గొడవలు కూడా జరిగేవి. ఎవరు గొప్ప? శివుడా, విష్ణువా అనే వాదనలు ఎక్కువగా ఉండేవి. కానీ, త్రిమూర్తులుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సమానంగా ఉన్నారు. ‘హర’ అంటే శివుడు, ‘హరి’ అంటే విష్ణువు. శివుని పేర్లలో విష్ణువు పేరు లేదు, కానీ విష్ణువు అవతారాల్లో ఒకటైన బాలాజీ పేరులో ‘ఈశ్వర’ ఎందుకు వచ్చింది?
ఇక్కడ ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. తిరుమల ఆలయం స్థాపనకు ముందు, ఆ విగ్రహాన్ని శైవులు శివుడిగా, వైష్ణవులు విష్ణువుగా పూజించేవారు. 12వ శతాబ్దంలో రామానుజాచార్యుడు తిరుపతికి వచ్చి ఈ వివాదానికి చెక్ పెట్టారు. కానీ, ప్రాచీన ఆళ్వారుల పాశురాల్లో… వేంకటేశ్వరుడిని.. హరి-హర సమైక్య మూర్తిగా (శివ-విష్ణు ఏకరూపం) చూశారు. విగ్రహంలో.. విష్ణువు ఆభరణాలతో పాటూ.. శివుడి సర్ప ఆభరణం కూడా ఉంది. ‘వేంకట’ అంటే పాపాలను తొలగించేది (వేం=పాపాలు, కట=తొలగించు), ‘ఈశ్వర’ అంటే పరమాత్మ అని అర్థం. ఇది శివుని ‘ఈశ్వర’ పేరును సూచిస్తుంది. కానీ వేంకటేశ్వరుడు… విష్ణువు అవతారం. ఈ మిక్స్.. శైవ-వైష్ణవ సమ్మేళనాన్ని చూపిస్తుంది.
టీటీడీ అధికారులు ఇటీవల ఈ చరిత్రను పునరుద్ఘాటించారు. 2025 బ్రహ్మోత్సవాల సందర్భంగా హరి-హర మహోత్సవం నిర్వహించారు. ఇది భక్తులలో ఏకత్వ భావాన్ని నింపింది. శనీశ్వరుడు (శని+ఈశ్వర) అంటే.. శివుని కొడుకు శని దేవుడు. విఘ్నేశ్వరుడు (విఘ్నాలు తొలగించే ఈశ్వర) అంటే గణపతి. ఇవి శైవ సంప్రదాయంలో ‘ఈశ్వర’ పేరు శివుని గొప్పతనాన్ని చూపిస్తాయి. కానీ వేంకటేశ్వరుని విషయంలో ఇది వైష్ణవ భక్తికి.. శైవ కొండను జోడించినట్లు. ఆదిశంకరాచార్యుడు ‘హరి సంకల్ప’లో రెండింటినీ ఏకం చేశాడు. ఈ రహస్యం భక్తులకు ఐక్యతను బోధిస్తోంది.
తిరుమలలో శ్రీవారిని శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం తిరుమల. కానీ విచిత్రంగా.. విష్ణుమూర్తి దశావతారాల్లో వేంకటేశ్వరస్వామి లేరు. సంప్రదాయంగా చెప్పే దశావతారాలు చూస్తే.. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ (లేదా బలరామ), కల్కి అవతారాలు ఉన్నాయి. మరి వేంకటేశ్వరస్వామి అవతారం ఎందుకు లేదు?
పురాణాల ప్రకారం.. విష్ణువు ఎత్తినది 10 అవతారాలే కాదు. మొత్తం 21 అవతారాలు ఎత్తారు. వాటిలో వేంకటేశ్వరుడు ఒక అర్చావతారంగా ఉంది. అంటే ఆలయంలో ఆరాధించే రూపం అని అర్థం. అంటే.. స్వామి.. కలియుగంలో ప్రత్యేకంగా భక్తుల రక్షణ కోసం అవతరించిన రూపం ఇది. అందుకే శ్రీవారిని.. కలియుక ప్రత్యక్ష దైవం అంటారు. అందుకే ఏడుకొండలవాడిని పూజిస్తే.. కోరికలు తీరతాయని అశేష భక్తుల నమ్మకం. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని పూజిస్తే.. డైరెక్టుగా విష్ణుమూర్తిని ఆరాధించినట్లే అంటారు.
విష్ణువు దశావతారాలు ఏయే యుగాల్లో ఏవేవి వచ్చాయో చూస్తే..సత్యయుగం (మొదటి యుగం):1. మత్స్యావతారం: ప్రళయం సమయంలో వేదాలను రక్షించడానికి చేప రూపంలో అవతరించారు.2. కూర్మావతారం: క్షీరసాగర మథనంలో మందరపర్వతాన్ని మోసేందుకు తాబేలు రూపం ఎత్తారు.3. వరాహావతారం: భూమిని రక్షించడానికి పంది రూపంలో అవతరించారు.4. నరసింహావతారం: హిరణ్యకశిపుని సంహరించడానికి సింహ-మనిషి రూపంలో వచ్చారు.త్రేతాయుగం:5. వామనావతారం: బలి చక్రవర్తిని నియంత్రించడానికి చిన్న బ్రాహ్మణ రూపం ఎత్తారు.6. పరశురామావతారం: అధర్మం చేసిన క్షత్రియులను శిక్షించడానికి ఈ రూపంలో వచ్చారు.7. రామావతారం: రావణాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి ఎత్తిన రూపం.ద్వాపరయుగం:8. కృష్ణావతారం: మహాభారత యుద్ధంలో గీతోపదేశం ఇచ్చి ధర్మాన్ని నిలబెట్టారు.కలియుగం:9. బుద్ధావతారం (కొన్ని సంప్రదాయాల్లో బలరాముడు): అహింస, కరుణను బోధించడానికి వచ్చారు.10. కల్కి అవతారం: అధర్మాన్ని నిర్మూలించడానికి కలియుగం చివరలో రాబోయే అవతారం.
భక్తుల కోసం శ్రీవారి అవతారం:దశావతారాల్లో లేని తిరుమల వేంకటేశ్వర స్వామి అవతారం కూడా కలియుగంలోనే వచ్చింది. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు భక్తులను రక్షించడానికి కలియుగంలో వేంకటేశ్వరుడిగా భూమిపై అవతరించాడు. ఆయన తిరుమల శేషాచల కొండలపై స్థిరపడ్డాడు. లక్ష్మీదేవి.. భూమిని విడిచిపెట్టిన తర్వాత.. భూదేవి అవతారమైన పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఈ అవతారాన్ని అర్చావతారం (ఆలయంలో ఆరాధించే రూపం)గా పరిగణిస్తారు. ఇలా వేంకటేశ్వరస్వామి.. ఎన్నో ఆసక్తకర రహస్యాలూ, ఆశ్చర్యాలతో తన భక్తులకు అచంతల భక్తి భావాలు, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ.. నిత్యపూజలు అందుకుంటున్నారు.
