Snake Heart: పాముకు గుండె ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ పార్ట్‌లో ఉంటుందీ..

Anatomical Position of Heart in Snakes: పాముల గురించి తెలియని వారుండరు. అలాగే పామను చూస్తే భయపడని వారు కూడా ఉండరు. చాలా మంది అన్ని పాములు విషపూరితమైనవని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కొన్ని పాములు మాత్రమే విషపూరితమైనవి..
పాముల గురించి తెలియని వారుండరు. అలాగే పామను చూస్తే భయపడని వారు కూడా ఉండరు. చాలా మంది అన్ని పాములు విషపూరితమైనవని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కొన్ని పాములు మాత్రమే విషపూరితమైనవి.
అలాగే పాములకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పాములకు గుండె ఉంటుందా? ఉంటే అది ఎక్కడ ఉంటుంది? అనే డౌట్ కూడా లేకపోలేదు.
నిజానికి పాములు అనేవి అందరూ ఆసక్తిగా చూసే సరీసృపాలు. అవి విషపూరితమైనవి కాబట్టి, దాదాపు అందరూ వాటికి భయపడతారు. కానీ ప్రతి పాము విషపూరితమైనది కాదు. పాముకి కాళ్ళు ఉండవు. అందుకే అది పాకుతుంది. దాని కళ్ళు, నాలుక తప్ప పాము ఇతర భాగాలను చూడలేం.
అందుకే చాలా మందికి పాముకి గుండె ఉంటుందా? అని సందేహిస్తుంటారు. పాముకి గుండె ఉంటే అది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది? అ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.
పాముకు గుండె ఉంటుంది. అది దాని శరీరం లోపల సురక్షితమైన ప్రదేశంలో ఉంటుంది. దాడి జరిగితే గుండె దెబ్బతినకుండా కాపాడటానికి పాము గుండెను పెరికార్డియం అనే ఒక రకమైన సంచి ద్వారా రక్షించబడుతుంది. అయితే పాములకు ఊపిరితిత్తులు ఉండవు. అందుకే పాము కదులుతున్నప్పుడు పాము గుండె కూడా దాని స్థానం నుండి కొద్దిగా కదులుతుంది.

