Extramarital Affair: వ్యభిచారిణిగా మారిన వివాహిత.. అందుకోసం భర్త రక్తం తాగింది

Extramarital Affair:అనుమానాస్పద మృతి కేసులో కూడా పోలీసులు షాక్ అయ్యే నిజాలు బయటకొచ్చాయి. డ్రైవర్‌గా పని చేస్తున్న కత్తి సురేశ్ అనే వ్యక్తి గత నెల 16న ఇంట్లో అకస్మాత్తుగా మృతి చెందాడు. దర్యాప్తులో భార్యే అతడ్ని ఎలా చంపిందో బయటపడింది.Extramarital Affair: వేదమంత్రాల సాక్షిగా మెడలో తాళి కట్టిన మొగుడ్ని ఎంతో సులువుగా హత్య చేస్తున్నారు కొందరు కిరాతకపు మహిళలు. వాళ్ల క్షణికానందం కోసం కొందరు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మరికొందరు భర్తలను ఊహించనంత దారుణంగా హత్య చేసి చేతులు దులుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అనుమానాస్పద మృతి కేసులో కూడా పోలీసులు షాక్ అయ్యే నిజాలు బయటకొచ్చాయి. డ్రైవర్‌గా పని చేస్తున్న కత్తి సురేశ్ అనే వ్యక్తి ఈనెల 16న ఇంట్లో అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అతని భార్యే మరో ఐదుగురు సహకారంతో భర్తను బీపీ టాబ్లెట్స్ , వయాగ్రా ఉపయోగించి హత్య చేసినట్లుగా నిర్ధారణైంది. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నిందితురాలు మౌనిక ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత భర్తపై ప్రేమ తగ్గడమే కాకుండా పదే పదే మనస్పర్థలు వస్తున్నాయని ఏకంగా వ్యభిచారిణిగా మారింది. ఈక్రమంలోనే తనకు దగ్గరైన వ్యక్తితో కలిసి జీవించాలని భర్తను అడ్డుతొలగించుకుంది. ఈ హత్య కేసులో కుట్ర పన్నిన ఆరుగురు నిందితులను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అసలు అనుమాన్పదమృతి కేసు మర్డర్‌గా ఎలా తేలిందో కరీంనగర్ సీపీ వివరంగా మీడియాకు వెల్లడించారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
భర్తను చంపిన భార్య..
కరీంనగర్ సప్తగిరి కాలనీలో నివాసముండే కత్తి సురేష్ మౌనిక ప్రేమించుకున్నారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. సురేష్, మౌనికలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు తొమ్మిది నెలల క్రితం మౌనిక వ్యభిచార వృత్తిలోకి దిగడంతో దొమ్మాటి అజయ్‌తో పరిచయం ఏర్పడింది. అతనితోనే అక్రమ సంబంధం కొనసాగించింది. ఈక్రమంలోనే భర్త తరచుగా డబ్బు కోసం వేధించడం భరించలేక పోయిన మౌనిక అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన బంధువుతో పాటు మరో నలుగురి సహకారంతో సురేష్‌ను చంపడానికి ఒక ప్రణాళికను రూపొందించింది మౌనిక.

