ధనుష్‌తో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన మృణాల్ ఠాకూర్.. అసలు మ్యాటరేంటి?

‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్, సౌత్ సూపర్ స్టార్ ధనుష్ మధ్య ఏదో నడుస్తోందని రూమర్స్ వస్తున్నాయి. ఈ మధ్య వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.‘దిష్టి తగులుతుందని నమ్ముతాను’:
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. తనకు ‘నరదృష్టి’ (బురీ నజర్) మీద బాగా నమ్మకం ఉందని చెప్పింది. ‘నేను నా కెరీర్లో ఇంకా ఎన్నో పనులు చేయాలి, ఎన్నో గోల్స్ చేరుకోవాలి. అయితే అవి పూర్తయ్యాకే వాటి గురించి మాట్లాడతాను. ఎందుకంటే ముందే చెబితే దిష్టి తగులుతుందని నేను నమ్ముతాను. చాలా తొందరగా దిష్టి తగులుతుంది’ అని చెప్పుకొచ్చింది. చాలా మంది తమ పనుల గురించి, లక్ష్యాల గురించి ముందే ఎక్కువగా మాట్లాడటం వల్ల అవి దెబ్బతింటాయని ఆమె అభిప్రాయపడింది. అందుకే తన జీవితంలో ఏం జరుగుతుందో పదే పదే చెప్పడం తనకు ఇష్టం ఉండదని, కొన్ని విషయాల్లో సరిహద్దులు పెట్టుకోవడం చాలా ముఖ్యమని మృణాల్ స్పష్టం చేసింది.మరి ఏదో నడుస్తోందా?
ఆగస్టు 1న జరిగిన మృణాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ధనుష్ హాజరుకావడంతో ఈ డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఆమె నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో కూడా ధనుష్ కనిపించాడు. అక్కడ ఇద్దరూ కాస్త ప్రైవేట్‌గా మాట్లాడుకుంటూ కెమెరాలకు చిక్కారు. వీరికి దగ్గరైన ఓ వ్యక్తి చెప్పిన ప్రకారం, ఇద్దరూ డేటింగ్లో ఉన్న మాట నిజమేనని, వారి రిలేషన్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, అందుకే అప్పుడే దీన్ని అఫీషియల్ చేసే ఆలోచనలో లేరని చెప్పారు. వీటన్నింటికీ తోడు, రచయిత కనికా థిల్లాన్ హోస్ట్ చేసిన ‘తేరే ఇష్క్ మే’ (ధనుష్ రాబోయే సినిమా) పార్టీలో కూడా మృణాల్ కనిపించింది. ఈ ఈవెంట్లో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఫొటోలకు పోజులివ్వడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది.
క్లారిటీ లేదు!
ప్రస్తుతానికి మృణాల్ గానీ, ధనుష్ గానీ తమ మధ్య ఉన్న బంధం గురించి అఫీషియల్‌గా ఏమీ చెప్పలేదు. కానీ ఈ మధ్య వారిద్దరూ కలిసి కనిపిస్తున్న తీరు, అలాగే ‘దిష్టి తగులుతుంది’ అంటూ మృణాల్ ఇచ్చిన హింట్.. ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. 2022లో ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకుల తర్వాత, ధనుష్ తన పర్సనల్ లైఫ్ విషయంలో చాలా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కెరీర్‌పై ధనుష్ ఫోకస్:
ధనుష్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఆ భారీ లైనప్‌లో ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో ధనుష్ దర్శకత్వం వహించి, రాసిన ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ సినిమా విడుదలైంది. ఈ హీరో దర్శకత్వంలో వస్తున్న ‘ఇడ్లీ కడై’ అనే మరో సినిమా అక్టోబర్ 1న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రీసెంట్గా నాగార్జున, రష్మిక మందన్న వంటి స్టార్స్ నటించిన బైలింగ్వల్ క్రైమ్ డ్రామా కుబేరతో ధనుష్ నటించి మెప్పించాడు. ఈ నవంబర్‌లో కృతి సనన్‌తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ అనే హిందీ రొమాంటిక్ ఫిల్మ్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను
