Vastu Tips: Plant the Maredu plant, which is the favorite of Lord Shiva, in this direction of the house.. There will be no shortage of wealth..

ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల విషయంలో కూడా వాస్తు నియమాలున్నాయి. ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలను ఏ దిశలో పెంచుకోవాలి? ఏ రోజున నాటాలి వంటి అనేక విషయాలను తెలుయజేస్తుంది. కార్తీక మాసం వచ్చేస్తుంది.. ఈ నెలలో శివుడికి ఇష్టమైన బిల్వ దళాలతో పూజ చేయాలనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఇంట్లో మారేడు మొక్కను పెంచుకోవచ్చా.. ఏ దిశలో పెంచుకోవాలి? ఏ రోజున నాటాలి అనే విషయాలను తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రంలో మారేడు మొక్క (బిల్వ మొక్క) చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శివుడికి ప్రీతికరమైన ఈ మొక్కని ఇంట్లో నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు, లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజు ఈ మొక్కకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం మాత్రమే కాదు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా మారేడు మొక్కను ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిదట. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మి అనుగ్రహం లభిస్తుందని.. ఐశ్వర్యానికి లోటు ఉందని .. శుభ ఫలితాలను ఇస్తుంది నమ్మకం.

మారేడు మొక్కను వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్కని ఒకొక్క దిక్కులో పెంచితే ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది. తూర్పు దిక్కున పెంచితే సమస్త సౌఖ్యాలు, ఉత్తర దిక్కులో పెంచితే అఖండ ధనలాభం, ఈశాన్యం దిశలో పెంచితే లక్ష్మి అనుగ్రహం తో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే మొక్కని పెంచడానికి సూర్యరశ్మి , వెంటిలేషన్‌కు ప్రాధాన్యత తప్పని సరి.

మారేడు మొక్క ఇంటికి శ్రేయస్సుని తీసుకుని రావడానికి, సానుకూలతను ఆకర్షించడానికి సోమవారం, ప్రదోషం లేదా మహా శివరాత్రి లేదా శివునికి సంబంధించిన ఏదైనా శుభ దినాన ఇంటి ఆవరణలో నాటండి. ఇలా చేస్తే ఆ ఇంట్లో పేదరికం తొలగి.. సంపదకు లోటు ఉండదని నమ్మకం.

అయితే మారేడు మొక్కని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెంచుకోకూడదు. అంతేకాదు సోమవారం, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథులలో ఈ మొక్కని నాటవద్దు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *