Anasuya: నా లైఫ్‌లో ఒక్కడే బాయ్‌ఫ్రెండ్, పెళ్లి కాకుంటే ఆ హీరోతోనే డేటింగ్ చేసేదాన్ని.. అనసూయ ఓపెన్

పలు ఇంటర్వ్యూల్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది అనసూయ. తన లైఫ్ మొత్తంలో ఒక్కడే బాయ్ ఫ్రెండ్ అని, తన ఫేవరేట్ హీరోతో డేటింగ్ చేయడానికి కూడా రెడీ అనే టాపిక్స్ ఓపెన్ గా మాట్లాడింది.యాంకర్ అనసూయ.. ఈ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే నెటిజన్లతో టచ్ లోకి వస్తూ నిత్యం చర్చల్లో నిలుస్తూ ఉంటుంది అనసూయ. తనదైన శైలి మాటలతో రచ్చ చేసే ఈ భామ.. వ్యక్తిగత విషయాలు బయటపెట్టడంలో కూడా ఏ మాత్రం మొహమాట పడదు. సందర్భాన్ని బట్టి తన లైఫ్ సీక్రెట్స్ రివీల్ చేస్తూనే ఉంటుంది.ఇందులో భాగంగానే పలు ఇంటర్వ్యూల్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది అనసూయ. తన లైఫ్ మొత్తంలో ఒక్కడే బాయ్ ఫ్రెండ్ అని, తన ఫేవరేట్ హీరోతో డేటింగ్ చేయడానికి కూడా రెడీ అనే టాపిక్స్ ఓపెన్ గా మాట్లాడింది. మరి ఆ వివరాలు చూద్దామా..అనసూయ కెరీర్‌తో పాటు ఫ్యామిలీ సంగతులపై కూడా నెటిజన్లు ఇంట్రెస్ట్ పెడుతుంటారు. అందుకే తన ఫ్యామిలీ విశేషాలు కూడా పంచుకుంటూ ఉంటుంది అనసూయ. ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.న్యూస్ రీడర్‌గా కెరీర్ షురూ చేసిన అనసూయ.. ఆ తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ షో చేసి భారీ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించింది. అనసూయ కోసమే రెగ్యులర్ గా జబర్దస్త్ చూసినవాళ్లు చాలా మందే ఉన్నారు. బుల్లితెరపై హవా నడిపిస్తూనే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జునతో కలిసి స్టెప్పేసి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది అనసూయ.అప్పటినుంచి అనసూయకు సినిమా అవాకాశాలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా ఆమె కెరీర్ మొత్తాన్ని టర్న్ చేసి పడేసింది. రంగమ్మత్త క్యారెక్టర్ ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఈ క్రమంలోనే వరుస సినిమా ఆఫర్స్ పట్టేస్తున్న ఈ భామ.. రీసెంట్ గా జరిగిన ఓ ప్రోగ్రాంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఒకవేళ మీకు పెళ్లి కాకుంటే టాలీవుడ్‌లో ఏ హీరోతో డేటింగ్ చేయడానికి రెడీ అనేవారు అని ప్రోగ్రాం యాంకర్ అడగ్గా.. దానికి ఏ మాత్రం ఆలోచించకుండా రామ్ చరణ్ అని చెప్పింది అనసూయ. అంటే అనసూయకు చెర్రీ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.అదేవిధంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన లైఫ్‌లో ఒక్కరే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని.. అతన్నే పెళ్లి చేసుకున్నాని వెల్లడించింది. అప్పట్లో తాను ఓ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలో పనిచేశానని, ఆ సమయంలోనే తాను డేటింగ్ లో ఉన్నట్లు చెప్పింది. అతనే శశాంక్ భరద్వాజ్. ఆపై ఆయన్నే పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది అనసూయ.రీసెంట్ గానే తన కొత్త ఇల్లు గృహప్రవేశం చేసింది అనసూయ. ఇందుకు సంబంధించిన ఫొటోలతో పాటు ఆ ఇల్లు విశేషాలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే అనసూయ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ, ఆమె సక్సెస్ ఫుల్ సినీ జర్నీ కొనసాగిస్తోంది.

