MS Dhoni: It is not me who decides whether I will play IPL or not.. Dhoni gave clarity

అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా సులభంగానే వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్‌కు మాత్రం అంత త్వరగా దూరం కాలేకపోతున్నాడు. వయసు 43 దాటేసినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు పుట్టుకొచ్చాయి.

ఎంఎస్ ధోనీ (MS Dhoni) రిటైర్మెంట్‌కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. ధోనీ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్‌స్టాప్ ఉండదు. అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా సులభంగానే వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్‌ (IPL 2025)కు మాత్రం అంత త్వరగా దూరం కాలేకపోతున్నాడు. వయసు 43 దాటేసినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి ధోనీ రిటైర్మెంట్ (MS Dhoni Retirement) గురించి వార్తలు పుట్టుకొచ్చాయి.

శనివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ధోనీకి అది చివరి మ్యాచ్ కావడంతోనే అతడి తల్లిదండ్రులు నేరుగా స్టేడియంకు వచ్చారని వార్తలు మొదలయ్యాయి.

అయితే ధోనీ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ధోనీ ఈ సీజన్ మొత్తం పూర్తయ్యే వరకు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.

*నేను ఐపీఎల్ ఆడాలా, వద్దా అని నిర్ణయించేది నేను కాదు, నా శరీరం. నాకు ఇప్పుడు 43 ఏళ్లు. జులై నెలలో 44వ సంవత్సరంలోకి అడుగు పెడతా. ఈ ఐపీఎల్ పూర్తిగా ఆడతా. వచ్చే ఐపీఎల్ గురించి నిర్ణయించుకునేందుకు నాకు 10 నెలల సమయం ఉంది. ఆ సీజన్ ప్రారంభానికి ముందు నా శరీరం సహకరిస్తోందనిపిస్తే ఆడతా. ఇక చాలు అనిపించే వరకు ఆడుతూనే ఉంటా. ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించను * అని ధోనీ స్పష్టం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *