Nature’s gift is kakara leaves.. a divine medicine for this problem.. how to take it..

భారతీయులు ఉపయోగించే కూరాగాయాల్లో కాకర కాయ ఒకటి. అయితే కాకర కాయ చేదుగా ఉంటుంది కనుక ఎక్కువ మంది దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే కాకరకాయ మధుమేహ నియంత్రణ సహా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఇస్తుంది. కాకరకాయ మాత్రమే కాదు కాకరకాయ ఆకులు కూడా అనేక ప్రయోజనాలు ఇస్తుందని తెలుసా.. కాకర ఆకులుమధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. దీనిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు? తెలుసుకుందాం.కాకరకాయ చేదుగా ఉంటుంది. అయితే ఇది ఔషధ గుణాలతో ప్రసిద్ధి చెందింది. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాని ఆకులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కాకరకాయతో పాటు దీని ఆకులు చాలా కాలంగా ఆయుర్వేదంలో వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతున్నాయి. కాకరకాయ ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. అంచులు ముళ్ళు తరహాగా ఉంటాయి. చేదు రుచిని కలిగి ఉంటాయి. ఈ ఆకులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్నాయి. వివిధ రకాల వ్యాధుల చికిత్సలో సహాయపడుతున్నాయి.మధుమేహాన్ని నియంత్రించడానికి కాకరకాయని వంటింటి చిట్కాలలో ఉపయోగిస్తారు. ఇది ఫైబర్, విటమిన్లు ఎ, సి సహా ఇతర పోషకాలకు మూలం. కానీ దీని ఆకులు కూడా ప్రయోజనకరం అని నిపుణులు చెబుతున్నారు.

నిపుణులు ఏమంటున్నారు? ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా కాకర ఆకుల ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుతూ.. కాకరకాయ ఆకులు మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడతాయని వివరించారు. వీటిల్లో ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ కాకర ఆకుల రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కాకరకాయ ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి ఐరెన్, ఫోలిక్ ఆమ్లం లభిస్తుంది. హిమోగ్లోబిన్‌ను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాకరకాయ ఆకులను రసం తయారు చేసుకుని తాగడం లేదా పచ్చిగా నమలడం చేయాలి.







		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *