మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చిన వారాహి అమ్మవారు

కొల్లిపర అక్టోబర్ 01:
మండలంలోని కుంచవరం గ్రామంలో వేంచేసియున్న వారాహి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా బుధవారం వారాహి అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి(బాల స్వామి ఆధ్వర్యంలో వేద పండితులచే చండీ హోమము, అభిషేకము, ప్రత్యేక పూజలునిర్వహించారు. చండీ హోమం యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు.ఆలయ అర్చకులు అనిల్ కుమార్ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తన్నీరు శ్రీనివాసబాబు, నాగ మల్లేశ్వరి, కళ్యాణం శ్రీనివాసరావు యోగా గురువు ముద్దాభక్తుని రమణయ్య, పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు చండీ హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

