This series, which discusses bold topics and human desires, is back with a new season. The first two episodes touched on sensitive topics like virginity and the male escort industry (gigolo).

బోల్డ్ టాపిక్స్, మనుషుల కోరికల గురించి చర్చించే ఈ సిరీస్.. కొత్త సీజన్‌తో మళ్లీ మన ముందుకొచ్చింది. మొదటి రెండు ఎపిసోడ్లు వర్జినిటీ, మేల్ ఎస్కార్ట్ ఇండస్ట్రీ (జిగోలో) వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశాయి.తమిళ వెబ్ సిరీస్ Sshhh సీజన్ 2 వచ్చేసింది. సమాజంలో మాట్లాడటానికి ఇష్టపడని బోల్డ్ టాపిక్స్, మనుషుల కోరికల గురించి చర్చించే ఈ సిరీస్.. కొత్త సీజన్‌తో మళ్లీ మన ముందుకొచ్చింది. మొదటి రెండు ఎపిసోడ్లు వర్జినిటీ, మేల్ ఎస్కార్ట్ ఇండస్ట్రీ (జిగోలో) వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశాయి. ఇలాంటి టాపిక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడాలనే ప్రయత్నం బాగుంది, కానీ దాన్ని తెరకెక్కించిన తీరు మాత్రం మిశ్రమంగా ఉంది. ఈ సిరీస్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.ఎపిసోడ్ 1: “కళ్ల కాదల్” (దొంగ ప్రేమ) ‘కళ్ల కాదల్’ కథ ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ శ్రద్ధ, అధిక్‌ల చుట్టూ తిరుగుతుంది. వీళ్లిద్దరూ సీక్రెట్‌గా ప్రేమించుకుంటారు. ఇంట్లో పేరెంట్స్ ఊరికి వెళ్లడంతో, ఆ ఒక్క రాత్రిలో తమ వర్జినిటీని కోల్పోవడానికి ఒక పక్కా ప్లాన్ వేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ప్లాన్ మొత్తాన్ని అమ్మాయి శ్రద్ధానే లీడ్ చేస్తుంది. ఇది రెగ్యులర్ మూస ధోరణిని బ్రేక్ చేసే ప్రయత్నం. అయితే, వాళ్ల ప్లాన్ ప్రకారం అంతా సాఫీగా సాగుతున్న టైంలో.. అనుకోని ఓ సంఘటన జరిగి అంతా తలకిందులవుతుంది. టెన్షన్‌తో ఉన్న వాళ్లకి ఇది మరింత తలనొప్పి తెచ్చిపెడుతుంది.కథ ఆలోచన చాలా బోల్డ్‌గా, నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఉన్నా.. దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం పూర్తిగా మెప్పించలేకపోయిందని విమర్శకులు అంటున్నారు. పాత్రలను బలంగా తీర్చిదిద్దలేదు. ముఖ్యంగా, సేఫ్టీ విషయంలో హీరో అధిక్‌ మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తించడం నవ్వించడానికి బదులు చిరాకు తెప్పిస్తుంది. వర్జినిటీ చుట్టూ ఉన్న అపోహలను బద్దలుకొట్టాలని మొదలుపెట్టి, చివరికి చాలా సేఫ్ అండ్ రెగ్యులర్ ముగింపు ఇచ్చారు. పెళ్లికి ముందు శృంగారంపై తల్లిదండ్రులు-పిల్లల మధ్య జరగాల్సిన చర్చను మొదలుపెట్టినా, దాన్ని మధ్యలోనే వదిలేయడంతో కథ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది.ఎపిసోడ్ 2: జిగోలో రెండో ఎపిసోడ్.. ‘జిగోలో’, మనకు పెద్దగా తెలియని మేల్ ఎస్కార్ట్స్ ప్రపంచాన్ని చూపిస్తుంది. కథేంటంటే.. వెట్రి అనే కుర్రాడు పెట్టిన ‘డాగ్ మేటింగ్ యాప్’ ఫెయిల్ అవ్వడంతో అప్పుల పాలవుతాడు. డబ్బు కోసం ఏం చేయాలో తెలియని స్థితిలో, తన కాలేజ్ సీనియర్ ద్వారా జిగోలో ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటాడు. అప్పులు తీర్చడానికి ఆ పనిలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి నమ్రత (వేదిక) అనే ఓ క్లయింట్ పరిచయమవుతుంది. పెళ్లి విఫలమవడం, గర్భస్రావం జరగడంతో తీవ్రమైన బాధలో ఉన్న ఆమెను వెట్రి కలుస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *