ASWA VAHANA SEVA MARKS COMPLETION OF VAHANAMS
TIRUPATI, 03 APRIL 2025: The Vahana Sevas concluded on a grand note at Sri Kodandarama Swamy temple with Aswa Vahanam on Thursday evening.
Both the senior and junior Pontiffs of Tirumala, temple officials, devotees were also present.
అశ్వవాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం
తిరుపతి, 2025 ఏప్రిల్ 03: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ముని శంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Jai srimannaryana