ఓర్నీ.. ఇంత పే..ద్ద.. కథ ఉందా.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం ఇదేనట..

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ఒకటి.. మూత్రపిండాలు.. రక్తాన్ని ఫిల్టర్ చేసి, విషాన్ని, అదనపు నీటిని తొలగిస్తాయి. అయితే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం మాత్రమే కారణం కాదు.. 20-30% కేసులలో అవి జన్యుపరంగా కూడా సంక్రమించవచ్చంటున్నారు నిపుణులు.. పరిశోధన ఏమి చెబుతుంది..? నిపుణులు ఏమని వివరిస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ఒకటి.. మూత్రపిండాలు.. రక్తాన్ని ఫిల్టర్ చేసి, విషాన్ని, అదనపు నీటిని తొలగిస్తాయి. ఈ ప్రక్రియ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. మూత్రపిండాలు శరీరంలోని ఖనిజాలు, ద్రవాల సమతుల్యతను కాపాడుతాయి.. తద్వారా శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది. అయితే, అధిక మొత్తంలో కాల్షియం, ఆక్సలేట్ లేదా యూరిక్ యాసిడ్ మూత్రంలో పేరుకుపోయినప్పుడు.. అవి స్ఫటికీకరించబడి క్రమంగా కిడ్నీ స్టోన్లను ఏర్పరుస్తాయి. ఈ రాళ్ళు పరిమాణంలో చిన్నవిగా ఉండవచ్చు.. కానీ కొన్నిసార్లు మూత్రపిండాలు లేదా మూత్ర నాళాన్ని అడ్డుకునేంత పెద్దవిగా పెరుగుతాయి. చాలా తక్కువ నీరు త్రాగడం.. ఎక్కువ ఉప్పు లేదా ప్రోటీన్ తీసుకోవడం, జీవనశైలి లోపాలు, జన్యుపరమైన కారకాలు కిడ్నీ స్టోన్ ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.

