స్నేహం లో డబ్బులు తీసుకోవడం
బంధం లో వ్యాపార భాగస్వామ్యం తీసుకోవడం ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నాశనం చేసే విషయాలు

ఈ మధ్య ఇది ఎక్కువ ఐపోయింది
సోషల్ మీడియా లో పరిచయం పెంచుకోవడం
ఎమోషనల్ గా మనిషికి దగ్గర కావడం
ఆ మనిషిని, వారి డబ్బు ని వాడుకోవడం
చాలా మాములు ఐపోయిన విషయాలు
బిజినెస్ చేసి లాభాలు ఇస్తా అని డబ్బు తీసుకోవడం
ఇంకా ఇంకా కావాలి అని అడగడం
ఎమోషనల్ గా వాళ్ళ స్నేహితుల దగ్గర కూడా డబ్బులు తెచ్చి తనకి ఇచ్చేలా చేయడం
ఆ తీసుకున్న డబ్బు వ్యాపారం లో పెట్టాను అని చెప్పి తన కుటుంబ అవసరాల కోసం విలాసలా కోసం వాడుకొని ఎదుటి వారి చేతిలో చిప్ప పెట్టడానికి రెడీ ఐపోవడం సర్వసధారణం ఐపోయింది
ఈ బాధితుల్లో ఆడవారు మగవారు ఇద్దరు ఉన్నారు
వారికీ డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఇల్లు గడవడానికి కూడా అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది కొందరికి ఐతే ఇలా డబ్బులు ఇచ్చి భార్య భర్తల మధ్య తీవ్ర విభేదాలు వచ్చి విడిపోతున్నారు పాపం పిల్లలు అన్యాయం ఐపోతున్నారు ఒకరి స్వార్ధనికి ఇంకొకరు ఇలా బలి అవుతున్నారు
ఒక ఆడది ఇలా విడిపోతే ఆ బాధ్యత తీసుకునే వాడు ఎవడు, నా వల్ల అన్యాయం జరిగింది అయ్యో అనే పశ్చితాపం కూడా ఉండటం లేదు చాలా క్రూరంగా ఉంటున్నారు అని అలా చేస్తే కూర ఐపోతారు
పైనా భగవంతుడు ఉంటాడు ని కర్మ ఎమ్ నిన్ను వదలదు ప్రాణం పోనివ్వక ఉన్నప్పుడే నరకం అనుభవించేలా చేస్తాది వీళ్ళు చేసే పాపలకి వీళ్ళ పిల్లలు అనుభవిస్తారు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎంత తప్పో అని కొందరికి ఎప్పటికి తెలియదు అనుకో
ఇలా నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన ఎందరో ఉన్నారు నా list లో పాపం చెబుతుంటే భలే బాధ అనిపిస్తుంది కానీ ఏమి చేస్తాం కొందరివీ సిగ్గు లేని జన్మలు అంతే ఎదుటి వారి డబ్బు మీదే ఆశ
ఇది కేవలం ఏ ఒక్కరికో జరిగేది మాత్రం కాదు
ఆశ తో ఆడవారు డబ్బులు కోల్పోతే
ఆకర్షణ తో మగవారు డబ్బులు కోల్పోతున్నారు
ఆశ ఆకర్షణ చాలా అంటే చాలా ఖరీదు ఐనది
అవి మీ జీవిత భాగస్వామి ని మీకు దూరం చేసే అంత
మీ పిల్లలు అద్భుతమైన జీవితాన్ని అనుభవించానంత
