These foods are a shield for the lungs.. They prevent illness..

ఊపిరితిత్తులు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు కూడా తరచూ సూచిస్తుంటారు. ఊపిరితిత్తులు దెబ్బతింటే ఆస్తమా, క్యాన్సర్, క్షయ, న్యుమోనియా వంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాగా రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయంలో ఊపిరితిత్తులు ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.. పాలకూర : పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. బీటా కెరోటిన్, క్లోరోఫిల్, జియాక్సంతిన్, లుటిన్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా క్లోరోఫిల్ వంటి యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఎండుద్రాక్ష : ఎండు ద్రాక్ష ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కొన్ని నానబెట్టిన ఎండు ద్రాక్షలు ఉదయం పరగడుపునే తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

టమోటా : టొమాటోల్లో లైకోపీన్ అనే రసాయన మూలకం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా, బలంగా మార్చడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది.

మెంతికూర : మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు మెంతి టీని తీసుకోవచ్చు. ఈ టీ తాగడం వల్ల కఫం తగ్గుతుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.

పసుపు : పసుపులో కర్క్యుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలుష్యం వల్ల కలిగే వాపు నుంచి ఊపిరితిత్తులను రక్షించడంలో సహాయపడతాయి. పసుపులో కర్క్యుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలుష్యం వల్ల కలిగే వాపు నుంచి ఊపిరితిత్తులను రక్షించడంలో సహాయపడతాయి.

These foods are a shield for the lungs.. They prevent illness..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *