These rules must be followed when using a copper bottle.. otherwise you will get trampled..

ఈ మధ్య కాలంలో కాపర్ వాటర్ బాటిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటితో ఉన్న ప్రయోజనాలు కారణం చాలామంది ఇవి వాడుతున్నారు. ఇది కేవలం నీళ్ళు పోసి వాడుకొనేది కాదు. రాగి ఒక రియాక్టివ్ మెటల్. దానిని జాగ్రత్తగా వాడాలని నిపుణులు చెబుతున్నారు. దానిని వాడి ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి ఆ రూల్స్ ఏంటి.? ఈరోజు ఇందులో వివరంగా తెలుసుకుందాం..  నీరు తప్ప మరేదైనా కాపర్ బాటిల్‎లో నింపకండి: జ్యూస్, నిమ్మకాయ నీరు, కార్బోనేటేడ్ పానీయాలు మీకు రిఫ్రెషింగ్‌గా అనిపించవచ్చు. కానీ వీటిని రాగి సీసాలో వేస్తే.. వీటిలోని ఆమ్లత్వం రాగితో చర్య జరిపి, అనారోగ్యంగా మారుతాయి. పుల్లగా ఉండే నిమ్మకాయ నీరు ఉదార ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇందులో గది ఉష్ణోగ్రతలో నీటిని మాత్రమే నింపండి. కాపర్ బాటిల్‎లో నీటిని ఎక్కువసేపు  నిల్వ ఉంచవద్దు: కాపర్ బాటిల్‎లో రాత్రిపూట అంత నీటిని ఉంచి మరుసటి రోజు ఉదయం తాగడం మంచిదే. కానీ రోజుల తరబడి ఆ బాటిల్‎లో నీళ్లు ఉంచవద్దు. రాగి సీసాలోలో నీరు ఎక్కువ రోజులు ఉంటే, లోహనన్ని ఎక్కువ గ్రహిస్తుంది. ఇది అనారోగ్యానికి కారణం అవుతుంది. సరిగ్గా శుభ్రం చేయడం మర్చిపోవద్దు: రాగి సీసా శుభ్రం చేయడానికి గట్టి స్క్రబ్ అవసరం లేదు. కానీ దీని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. లేకపోతే, మరకలు, ఆకుపచ్చని మచ్చల ఏర్పడి ఆక్సీకరణకు గురవుతుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే కాపర్ బాటిల్‎ని ఉప్పు, చింతపండు వంటి వాటితో క్లీన్ చెయ్యండి. కడిగిన తర్వాత తడిగా ఉంచవద్దు: మూసి ఉన్న రాగి సీసా లోపల తేమ, గాలి రంగు మారడాన్ని వేగవంతం చేస్తుంది. వాసనకు దారితీస్తుంది. కడిగిన తర్వాత మూత తెరిచి ఉంచి బాటిల్‌ను పూర్తిగా గాలిలో ఆరనివ్వండి. ఈ ఒక చిన్న అలవాటు మీ బాటిల్‌ను తాజాగా ఉంచుతుంది. లేదంటే తర్వాత వాడినప్పుడు అనారోగ్యానికి కారణం అవుతుంది.ఇందులో నీరు అతిగా తాగకండి: అవును, రాగి  బాటిల్‎తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిలో నీరుకి ఎక్కువగా తాగడం సరైనది కాదు. కాదని తాగితే వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో రాగి విషప్రభావం కూడా చూపించవచ్చు. కాపర్ బాటిల్‎లో రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల  నీరు సరిపోతుంది. 



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *