Ration Card News: బియ్యానికి బదులు డబ్బుల పంపిణీ.. రేషన్ కార్డు ఉన్న వారు ఇది గమనించారా..

రేషన్ కార్డు ఉన్న వారు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఏంటని అనుకుంటున్నారా.. రేషన్ బియ్యం బదులు డబ్బులు పంపిణీ చేశారు. రేషన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని గుర్తింపు కార్డుగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే రేషన్ కార్డు ఉంటే చాలు.. తక్కువ ధరకే రేషన్ సరుకులు పొందొచ్చు. కంది పప్పు, చక్కెర, బియ్యం వంటివి లభిస్తున్నాయి. గతంలో అయితే ఇంకా రాగులు, జొన్నలు కూడా ఇచ్చే వారు. చాలా ఏళ్ల కిందట అయితే వంట నూనె ప్యాకెట్లు కూడా రేషన్ దుకాణాల్లో లభించేవి.ఈ విధంగా రేషన్ కార్డు ఉంటే చాలు పలు రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. సంక్షేల పథకాల ప్రయోజనాలు పొందాలంటే చాలా వరకు రేషన్ కార్డు ఉండాల్సిందే. అప్పుడే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందగలం. లేదంటే లేదు.రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబం కూడా రేషన్ దుకాణాల నుంచి రేషన్ సరుకులు ప్రతి నెలా పొందొచ్చు. వేలి ముద్ర వేసి సరుకులు తీసుకువెళ్లొచ్చు. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గవర్నమెంట్ ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు పంపిణీ చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.మండలంలోని మార్కొండపుట్టి జిసిసి డిపో పరిధిలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా అయితే కుటుంబానికి దాదాపు 20 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు. ఇక చక్కెర, కంది పప్పునకు డబ్బులు కట్టాలి. రేషన్ బియ్యం ఒక్కో మనిషికి 5 కేజీల చొప్పున ఇస్తారు. అంటే కుటుంబ సభ్యులు పెరిగితే బియ్యం కూడా ఎక్కువే వస్తాయి.అయితే మన్యం జిల్లా మక్కువలో బియ్యం తక్కువగా డిపోకు వచ్చాయన్న నెపంతో కేజీ బియ్యానికి 20 రూపాయలు చొప్పున లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేశారు. దీంతో మండలంలోని కె.పెద్దవలస గిరిజన గ్రామంలో గురువారం స్థానిక రచ్చబండ వద్ద రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే వ్యక్తి గిరిజనులతో వేలిముద్రలు వేయించుకున్నారు.అయితే అనంతరం బియ్యానికి బదులు డబ్బులు పంపిణీ చేసినట్లు స్థానిక సర్పంచ్ రాములమ్మ భర్త రాంబాబు విలేకరులకు తెలిపారు. సుమారు 50 కుటుంబాలకు ఇలాగే నగదు పంపిణీ చేసినట్లు తెలిపారు. దీనిపై స్థానికులు ఏమీ చేయలేక డబ్బు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజనులకు బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేసిన విషయంపై స్థానిక సేల్స్‌మేన్ హరిప్రసాద్‌ను విలేకరులు వివరణ కోరగా తమ డిపోకు ఈ నెల రావాల్సిన స్టాకు రాలేదని తెలిపారు. సుమారు 40 బస్తాల వరకు బియ్యం రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బియ్యం ఊటగెడ్డలో ఉన్నందున కొంతమంది గిరిజనులకు నగదు పంపిణీ చేయాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఇక్కడ మరో విడ్డూరం జరిగింది. వాళ్లు ఎలాగూ వ్యాపారులకు బియ్యం అమ్ముకుంటున్నారు కదా.. డబ్బులు పంపిణీ చేసి వారికి ఇబ్బందులు లేకుండా చేశానని ఆ రేషన్ డిస్ట్రిబ్యూటర్ సమాధానం ఇవ్వడం కొసమెరుపు.

